Banana | అరటిపండు ఎప్పుడు తినాలి .. డైట్‌లో టైమింగ్‌పై ఆధారపడే ఆరోగ్య ప్రయోజనాలు!
Banana |అరటిపండు మనకు అందుబాటులో ఉండే సాధారణ పండు. రుచిగా ఉండడమే కాకుండా, ఇందులోని పోషకాల వలన ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 వంటి ముఖ్యమైన పోషకాలతో అరటిపండు అన్ని వయస్సులవారు తినదగ్గ ఆహారంగా నిలుస్తుంది.
#image_title
ఉదయం – బ్రేక్‌ఫాస్ట్‌తో తినాలి!
ఉదయం నిద్రలేచిన తర్వాత అరటిపండును బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తినడం ఎంతో మంచిది.
అరటిపండులోని ఫైబర్ ఉదయపు ఆకలిని నియంత్రిస్తుంది.
పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అరటిపండు తిన్న తర్వాత ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలుగుతుంది.
విటమిన్ B6 శక్తిని పెంచుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది.
టిప్: ఖాళీ కడుపుతో కాకుండా, పెరుగు, గింజలు వంటి ప్రోటీన్‌తో కలిపి తినడం మంచిది.
వ్యాయామానికి ముందు – శక్తి కోసం అరటిపండు
జిమ్‌కు వెళ్లే ముందు అరటిపండు తినడం ద్వారా తక్షణ శక్తి లభిస్తుంది.
కార్బోహైడ్రేట్లు వేగంగా జీర్ణమవుతాయి (15–30 నిమిషాల్లో).
శక్తిని వెంటనే అందించి వ్యాయామ సమయంలో ఒత్తిడి తగ్గిస్తుంది.
పొటాషియం కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
భోజనం తర్వాత – జీర్ణక్రియకు బూస్ట్
భోజనానికి అరటిపండు జోడిస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది.
ప్రీబయోటిక్ గుణాలు ఉన్న రెసిస్టెంట్ స్టార్చ్, ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది.
అరటిపండ్లను ప్రోటీన్ లేదా ఆరోగ్యకర కొవ్వులతో కలిపి తినడం వల్ల శక్తి స్ధిరంగా విడుదల అవుతుంది.
రాత్రి – నిద్రకు సహాయపడే పండు
నిద్ర సమస్యలున్న వారికి అరటిపండు రాత్రి సమయంలో ప్రయోజనం కలిగిస్తుంది.
మెగ్నీషియం, పొటాషియం కండరాల నరాలను సడలిస్తాయి.
విటమిన్ B6 మెలటోనిన్ ఉత్పత్తిని ఉత్తేజితం చేస్తుంది.
మంచి నిద్ర కోసం సహాయకారి.
ఎప్పుడు తినకూడదు? – ఖాళీ కడుపుతో తప్పండి
బాగా పండిన అరటిపండును ఖాళీ కడుపుతో తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి మళ్లీ పడిపోవచ్చు.
దాంతో శరీరం బలహీనంగా అనిపించవచ్చు.
కొంతమందికి జీర్ణ సమస్యలు రావచ్చు.