Whats App | వాట్సాప్‌లో నూతన ఫీచర్ .. ఇకపై ఏ భాషలోనైనా వచ్చిన మెసేజ్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు!
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు ‘మెసేజ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ (Message Translation Feature)’ ను అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు ఇకపై ఎలాంటి భాషలో వచ్చిన మెసేజ్‌నైనా చదవవచ్చు, అర్థం చేసుకోవచ్చు.

#image_title
మెసేజ్ అనువాదం ఇక మీ ఫోన్‌లోనే
వాట్సాప్ ప్రకారం, మెసేజ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ పూర్తిగా యూజర్ ప్రైవసీకి అనుగుణంగా రూపొందించబడింది. ఈ ఫీచర్ ఉపయోగించడంలో పెద్ద కష్టమే లేదు. మీరు అనువదించాలనుకున్న మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయండి. తర్వాత ‘Translate’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి, మీరు కావలసిన భాషను ఎంచుకోవచ్చు.
తొలిసారి ఉపయోగిస్తే, ఆ భాషను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న భాషలు చూస్తే.. ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, అరబిక్ ..ఇవి ఆండ్రాయిడ్ యూజర్స్‌కి అందుబాటులో ఉంటాయి. iPhone వినియోగదారులకు ఇంకా విస్తృతంగా 19 భాషలు ట్రాన్స్‌లేట్ చేయడాన్ని సపోర్ట్ చేస్తాయి. భవిష్యత్తులో మరిన్ని భాషలను చేర్చే యోచనలో ఉంది వాట్సాప్. Android వాడకందారుల కోసం అదనంగా ఓ ప్రత్యేక ఎంపిక అందుబాటులోకి రానుంది. వినియోగదారులు ఒక ప్రత్యేక చాట్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్‌లేట్ ఆప్షన్‌ను ఆన్ చేస్తే, ఆ చాట్‌లో వచ్చే అన్ని మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా అనువదించబడతాయి. దీని వల్ల ప్రతి మెసేజ్‌ను మాన్యువల్‌గా ట్రాన్స్‌లేట్ చేయాల్సిన అవసరం ఉండదు.