e Aadhaar App | ఇక నుండి అన్ని ఆధార్ సేవలు ఒకే యాప్‌లో.. త్వరలోనే అందుబాటులోకి
e Aadhaar App | భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డులో చిన్న చిన్న తప్పిదాలు, అప్‌డేట్లు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రజలు తరచుగా ఈ-సేవా కేంద్రాలు లేదా అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది.

#image_title
ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఆధార్‌కు సంబంధించిన అన్ని ముఖ్యమైన సేవలను సులభంగా, తక్షణమే పొందగలుగుతారు. ఇప్పుడీ ఈ-ఆధార్ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ-ఆధార్ యాప్ అంటే ఏమిటి?
ఈ-ఆధార్ యాప్ అనేది మీ ఆధార్ కార్డు సంబంధిత సేవలన్నింటినీ ఒకే చోట పొందేందుకు రూపొందించిన మొబైల్ అప్లికేషన్. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న mAadhaar యాప్కు పరిష్కారమైన ఓ అభివృద్ధి చెందిన వెర్షన్‌లా చెప్పుకోవచ్చు.ఈ యాప్ ద్వారా మీరు మీ ఆధార్ కార్డును డిజిటల్ రూపంలో పొందడమే కాకుండా, అవసరమైన మార్పులు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు.
ఈ-ఆధార్ యాప్ ముఖ్య ఫీచర్లు:
పేరు, చిరునామా, పుట్టిన తేది, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని యాప్ ద్వారానే మార్చుకోవచ్చు.మీ ఆధార్‌ను డిజిటల్ రూపంలో ఎప్పుడైనా, ఎక్కడైనా షేర్ చేయవచ్చు.జనన ధృవీకరణ పత్రం, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లులు మొదలైన వాటిని స్వయంచాలకంగా ధృవీకరించుకునే సదుపాయం. ఐరిస్ లేదా ఫింగర్‌ప్రింట్ లింకింగ్‌కి మద్దతు. ఆధార్ అప్‌డేట్ స్టేటస్ తెలుసుకోవడం, డౌన్‌లోడ్ చేసుకోవడం, పాస్వర్డ్ ప్రొటెక్షన్ వంటి సదుపాయాలు.