WhatsApp Users : ప్రముఖ సోషల్ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు ఉన్నారు. వారి అభిమానాన్ని చూరగొనేందుకు వాట్సాప్ అనేక అప్ డేట్లను రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వారిని సర్ ప్రైజ్ చేయాలనే లక్ష్యంతో ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ కొత్త ఫీచర్లు యూజర్లకు కూడా తెగ నచ్చుతూ ఉంటాయి. అలా వాట్సాప్ యూజర్ బేస్ రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. మార్కెట్లో ఎన్ని పోటీ యాప్స్ వచ్చినా కానీ వాట్సాప్ ను ఢీ కొట్టలేక చతికిల పడిపోతున్నాయి.వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ చాటింగ్ చేసుకునే సభ్యులకు మరింత వెసులుబాటు కలగనుంది. ఇన్ని రోజులు వాట్సాప్ లో ఉన్న గ్రూపుల్లో కేవలం 256 మంది మాత్రమే సభ్యులుగా ఉండేవారు. అంత కంటే లిమిట్ ఎక్కువ అయితే సభ్యులను యాడ్ చేయడం వీలు కాకపోయేది. కానీ వాట్సాప్ ఇప్పుడు ఈ నంబర్ ను డబుల్ చేసింది. ఇక మీదట నుంచి వాట్సాప్ గ్రూప్ లో 512 మందిని యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ ప్రకటించింది.ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ ఇప్పుడు ఈ గ్రూప్ సభ్యుల ఫీచర్ ను కూడా యాడ్ చేసింది.
అంతే కాకుండా కమ్యూనిటీ గ్రూప్ చాట్ పేరుతో ఫీచర్ ను కూడా యాడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమ్యూనిటీ గ్రూప్ చాట్ ఫీచర్ కూడా యూజర్లకు ఎంతో ఉపయోగపడనుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ కమ్యూనిటీ గ్రూప్ చాట్ ఫీచర్ ద్వారా యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏంచక్కా గ్రూప్ చాట్ చేసుకోవచ్చు.ఇవే కాకుండా మరో గుడ్ న్యూస్ ను కూడా వాట్సాప్ తన యూజర్లకు చెప్పింది. అదే ఫైల్ పరిమాణం. ఇప్పటి వరకు వాట్సాప్ లో 100 సైజులో ఉండే ఫైల్స్ ను మాత్రమే పంపించుకునేందుకు వీలుండేది. కానీ ఇక నుంచి ఆ సైజును 2జీబీకి పెంచనున్నట్లు వాట్సాప్ తెలిపింది.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ని చూస్తుంటే వారు సెలబ్రిటీల మాదిరిగా కనిపించడం లేదు.…
This website uses cookies.