YS Viveka Murder Case : వివేకా కేసులో సీబీఐ చేతికి అతిపెద్ద ఆధారం..!
YS Viveka Murder Case : వైఎస్ వివేకానంద హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు వైఎస్ వివేకానంద హత్య కేసులో అసలు హంతకులు ఆయన కుమార్తె, అల్లుడే అని తేటతెల్లం అవుతోంది. వైఎస్ వివేకానందకు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న వాళ్లకు ఆయన కూతురు, అల్లుడు మద్దతుగా ఉన్నట్టు తెలుస్తోంది. వివేకా కుటుంబ సభ్యులు, టీడీపీ కలిసి వేసిన స్కెచ్చే ఇది అన్నట్టుగా తెలుస్తోంది. కావాలని వివేకా రాసిన లేఖను గోప్యంగా ఉంచి.. ఈకేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఇరికించినట్టుగా తెలుస్తోంది. అవినాశ్ ను ఎందుకు ఇరికించారు. వివేకా హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఎంత అనేదానిపై దర్యాప్తు సాగాలి కానీ..
ఎల్లో మీడియా మాత్రం దానికి విరుద్ధంగా కథనాలు వండి వార్చుతోంది. అసలు.. వివేకా హంతకులతో, కుట్రదారులతోనే ఇంటర్వ్యూలు తీసుకుంది. వివేకాను చంపింది నేనే అని ఒప్పుకున్న దస్తగిరితో.. వివేకా హత్యకు ప్లాన్ చేసిన బీటెక్ రవితోనూ ఇంటర్వ్యూలు తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు, అల్లుడు జతకట్టారు. హంతకుడు దస్తగిరిని ఉసిగొప్పి వివేకాను చంపేందుకు కుట్రపన్నారు. ఇది కేవలం ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం జరిగిన హత్య. ప్రత్యర్థి పార్టీలు ఆడించినట్టుగా వీళ్లు ఆడారు. ఆ హత్య కేసును భూస్థాపితం చేసేందుకు కూడా వివేకా కుటుంబ సభ్యులే ప్రయత్నించారు.
YS Viveka Murder Case : చంద్రబాబుతో జత కట్టిన వివేకా కూతురు, అల్లుడు
అసలు వివేకా కుటుంబ సభ్యులు.. వివేకా ప్రత్యర్థులతో ఎందుకు జట్టు కట్టారు. వివేకా శత్రువులతో జట్టు కట్టడం ఏంటి.. నిజానికి.. వివేకాతో అల్లుడు, ఆయన చిన బావమరిది, పెద్ద బావమరిది లాంటి వాళ్లకు రాజకీయ వారసత్వ విభేదాలు ఉన్నాయి. ఆస్తి విభేదాలు కూడా ఉన్నాయి. ఆయన హత్య కేసును పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు అండ్ కో.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇందులోకి లాగింది. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అమరావతి నుంచే ఈ తతంగాన్ని మొత్తం చంద్రబాబు నడిపించారు. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు, టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవితో కలిసి ఈ ప్లాన్ ను దస్తగిరితో వర్కవుట్ చేయించారు అనేది సుస్పష్టం అవుతోంది.