Nimmagadda Ramesh: ఓహ్, నిమ్మగడ్డకి వెనక ఉండి నడిపిస్తోంది ఈ వ్యక్తి అన్నమాట ?
who is political power behind nimmagadda ramesh
ఏపీ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను అనుకున్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దం అయ్యాడు. సుప్రీం కోర్టు నుండి కూడా అనుమతులు రావడంతో మొత్తం హడావుడి వాతావరణం నెలకొంది. ఇష్టం లేకుండానే వైకాపా ఎన్నికలకు సిద్దం అవుతుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక విధాలుగా ఎన్నికలను వాయిదా వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సమయంలోనే నిమ్మగడ్డ రమేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాపు ఉద్యమ సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశాడు. అందులో పలు విషయాలను ప్రస్థావించడం జరిగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాజకీయాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ ముద్రగడ ఆరోపించాడు.
Nimmagadda Ramesh ఒక రాజకీయ నాయకుడిగా ప్రవర్తించవద్దు..
నిమ్మగడ్డ రమేష్ ఒక రాజకీయ నాయకుడి మాదిరిగా వ్యవహరిస్తున్నాడని, ఆయన తీరు ఏమాత్రం హర్షనీయం కాదంటూ రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ కూడా అదే విషయాన్ని తెలియజేశాడు. ముద్రగడ చాలా ఘాటుగానే ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్నాడు అంటూ విమర్శలు చేశాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజల ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన విషయం. అది పక్కన పెట్టి ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దం అవ్వడం అనేది రాజకీయ అజెండాను అమలు చేసినట్లుగానే అనిపిస్తుందని ముద్రగడ పద్మనాభం అభిప్రాయం వ్యక్తం చేశాడు.
నిమ్మగడ్డ రమేష్ వెనుక అదృశ్య శక్తి
స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో జరిపి తీరాలని భావిస్తున్న నిమ్మగడ్డ రమేష్ వెనుక అదృశ్య శక్తి ఉన్నట్లుగా అనిపిస్తుందని మద్రగడ పద్మనాభం అభిప్రాయం వ్యక్తం చేశాడు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తించాలి. కాని ఇప్పుడు అలా లేదు. నిమ్మగడ్డ రాజకీయంగా తల దూర్చడంతో పాటు ఆయన కొందరు రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మ మాదిరిగా మారిపోయాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి చోట కూడా నిమ్మగడ్డ రమేష్ పై విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా ఆయన ముందుకు వెళ్లడం అనేది ఆయన రాజకీయ పోకడలను చూపిస్తుందని ఈ సందర్బంగా ముద్రగడ పద్మనాభం అభిప్రాయం వ్యక్తం చేశారు.