Oats | ఓట్స్ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ప్రతి ఒక్కరికీ కాదు! ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే?
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన ఎంపికగా భావిస్తున్నారు చాలామంది. అయితే ఓట్స్ కొందరికి అనారోగ్యానికి కారణం కావచ్చని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఓట్స్‌లో సహజంగా గ్లూటెన్ ఉండకపోయినా, వాటిని ప్రాసెసింగ్ చేసే సమయంలో ఇతర ధాన్యాలతో కలిసిపోవడం వల్ల క్రాస్-కాలుష్యం జరగవచ్చు. దీని వలన సెలియాక్ వ్యాధి ఉన్నవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది.

#image_title
జీర్ణ సమస్యలున్నవారు జాగ్రత్త!
జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఓట్స్ తినేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఓట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియపై ఒత్తిడి పెడుతుంది.
అలెర్జీ ఉన్నవారికి ప్రమాదమే
ఓట్స్ తినడం వల్ల కొన్ని అరుదైన కానీ తీవ్రమైన అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఓట్స్‌లోని అవెనిన్ అనే ప్రొటీన్‌కి రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించడం వల్ల చర్మంపై దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలు, జీర్ణ తలెత్తే అవకాశం ఉంది.
షుగర్ ఉన్నవారికి పరిమితిలోనే ఓట్స్
ఓట్స్‌లో సహజమైన కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఓట్స్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.
ఖనిజాల లోపం ఉన్నవారికి హెచ్చరిక
ఓట్స్‌లో ఉండే ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియెంట్ శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాల శోషణను దెబ్బతీసే అవకాశముంది. ఇది ఆరోగ్యంగా ఉన్నవారికి పెద్దగా హాని చేయకపోయినా, ఖనిజాల లోపం ఉన్నవారికి మాత్రం ఇది సమస్యగా మారవచ్చు.