టీపీసీసీ పగ్గాలు ఎవరికివ్వాలి? 2023లో కాంగ్రెస్ గెలవాలంటే ఎవరైతే కరెక్ట్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

టీపీసీసీ పగ్గాలు ఎవరికివ్వాలి? 2023లో కాంగ్రెస్ గెలవాలంటే ఎవరైతే కరెక్ట్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 December 2020,3:53 am

కాంగ్రెస్ పార్టీ.. జాతీయంగా చూసుకున్నా.. రాష్ట్రాల పరంగా చూసినా.. ఎక్కడా పార్టీని పట్టించుకునే నాథుడే లేడు. కాంగ్రెస్ ప్రస్తుతం అగాథంలో చిక్కుకుంది. ఏ రాష్ట్రంలో చూసినా అదే పరిస్థితి. నార్త్ లోనూ అంతే. సౌత్ లో అయితే చెప్పక్కర్లేదు. తెలంగాణ, ఏపీ లాంటి రాష్ట్రాల్లో అయితే పార్టీ ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు.

who will be the next tpcc president

who will be the next tpcc president?

సరే.. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాలు విడిపోకముందు.. ఉమ్మడి ఏపీని దశాబ్దాల పాటు ఏలిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ.. ప్రస్తుతం రాష్ట్రాలు విడిపోయినా.. అక్కడ ఏపీలో.. ఇక్కడ తెలంగాణలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ గడ్డుపరిస్థితులనే ఎదుర్కొంటోంది.

తెలంగాణకు ఏఐసీసీ ఇన్ చార్జ్ గా మాణికం ఠాగూర్ వచ్చినా పరిస్థితులు మాత్రం మారలేదు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ఘోరంగా విఫలమయ్యారు. అందుకే.. ఆయన నైతిక బాధ్యత వహిస్తూ తన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

నిజానికి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన పీసీసీ పదవికి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడే రాజీనామా చేసినప్పటికీ.. కాంగ్రెస్ హైకమాండ్ అప్పుడు ఒప్పుకోలేదు. కుంతియాను తీసేసి.. కొత్త ఇన్ చార్జ్ గా మాణికంను నియమించారు. అయినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళన చేయాలని హైకమాండ్ భావిస్తోందట.

ముఖ్యంగా.. టీపీసీసీ చీఫ్ గా ఎవరైతే బెటర్? 2023 ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ గెలవాలంటే… పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి? అనే దానిపై అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తోందట.

పీసీసీ రేసులో ఉన్న నేతలు వీళ్లే

పీసీసీ అధ్యక్షుడి రేసులో మాత్రం చాలామంది నేతలే ఉన్నారు. ముందు వరుసలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉండగా.. ఆ తర్వాత స్థానంలో మల్లు భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు.

ఎవరిని పీసీసీ అధ్యక్షుడిని చేయాలనేదానిపై కాంగ్రెస్ పార్టీ బాగానే కసరత్తులు చేస్తోంది. మాణికం ఠాగుర్ త్వరలోనే హైదరాబాద్ వచ్చి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, సీనియర్ నేతలు, జిల్లాల అధ్యక్షులు, ఇతర నాయకులు.. అందరితో చర్చించి.. వాళ్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నట్టుగా తెలుస్తోంది.

2023 ఎన్నికలకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు వేస్తోందంటే.. 2023లో ఏదైనా జరగొచ్చన్నమాట? లెట్స్ వెయిట్ అండ్ సీ..

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది