Tadepalli Gudem Constituency : గూడెంలో గుబులు… ఈసారి అధికారం ఎవరిది…!!
Tadepalli Gudem Constituency : మిషన్ 2024. ఉమ్మడి గోదావరి జిల్లాలో తాడేపల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. సైలెంట్ ఓటింగ్ తో కనిపించే నియోజకవర్గం ఇది. ఇక తాడేపల్లిగూడెం ని మిగతా ప్రాంతాలతో పోల్చిచూస్తే ఇక్కడ పాలిటిక్స్ అంత హాట్ హాట్ గా లేకపోయినా పోటాపోటీ మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలిచిన కొట్టు సత్యనారాయణ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కానీ ఆయనకు టికెట్ ఇంకా కన్ఫామ్ చేయలేదు. అలాగే టిడిపి , జనసేన కూటమిలోనూ స్పష్టత లేదు. ఈ క్రమంలోనే దీనిని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. టిడిపి కన్నా జనసేనకు ఇస్తేనే కూటమి విజయం సాధిస్తుంది అని అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. తాడేపల్లి నియోజకవర్గంలో 1999 తర్వాత టిడిపి గెలవలేదు. కానీ టిడిపి మద్దతుగా బిజెపి అభ్యర్థి పైడికొండల మాణిక్యాల రావు గెలిచారు. ఈసారి టిడిపి మద్దతులో ఇతర పార్టీలు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. తాడేపల్లి నుంచి పెద్దగా ప్రచారం జరగని ఎన్నో అంశాలు ఉన్నాయి. ఏపీలో అతి పెద్ద ఉల్లి మార్కెట్ ఇక్కడే ఉంది. మరోవైపు అక్షరాభ్యాసాల బాసర తర్వాత తాడేపల్లిగూడెం లోనే సరస్వతి దేవి ఆలయం ప్రసిద్ధి పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారు ఇక్కడ యుద్ధ విమానాలను నిలిపేందుకు అనువుగా రెండు కిలోమీటర్ల మేర ఉన్న రన్ వేణి నిర్మించారు. బెల్లం పప్పు దినుసుల వ్యాపారానికి కూడా తాడేపల్లిగూడెం ప్రసిద్ధి పొందింది.
ఇది ఇలా ఉండగా మరో ఎన్నికల పోరాటానికి గూడెం సిద్ధమైంది. వైసిపి నుంచి కొట్టు సత్యనారాయణ జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా పోలిశెట్టి శ్రీనివాస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది కానీ ఇంకా ఖరారు కాలేదు. అయితే గత ఎన్నికల్లో తాడేపల్లి గూడెంలో వైసిపి అభ్యర్థి కొట్టు నారాయణ పోటీ చేసి 42 శాతం ఓట్లు సాధించారు. అటు టిడిపి నుండి మధుసూదన్ రావు పోటీ చేసి 32 శాతం ఓట్లు రాబట్టారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బొల్లి శ్రీనివాసరావు 22% ఓట్లు సాధించారు. అయితే బొలిశెట్టి శ్రీనివాస్ టిడిపి టికెట్ ఆశించి అది రాకపోయేసరికి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. నిజానికి టిడిపి జనసేన కలిసి పోటీ చేసినట్లయితే ఆ పార్టీ విజయం సునాసితమయ్యేది. కాని ఓట్లు చీలడం తో వైసిపి అభ్యర్థి గెలుపు ఈజీ అయిపోయింది. ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత కొట్టు సత్యనారాయణ మంత్రి పదవి వచ్చిన డిప్యూటీ అయిన ఆయన టిడిపి జనసేన మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను తిట్టడమే అయిపోయింది. తాడేపల్లి జిల్లాలో రోడ్లు సరిగ్గా లేకపోవడం వలన జనం ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి స్టోరేజ్ ట్యాంకులను నిర్మిస్తామని హామీ ఇచ్చి పట్టించుకోలేదు. గ్రౌండ్ లెవెల్ లో యాక్టివ్ గా లేకపోవడంతో కొట్టు సత్యనారాయణ కు మైనస్ గా పడింది. టిడిపి జనసేన పొత్తుతో పోటీ ఏకపక్షంగా మారిందని ప్రచారం ఇప్పటికే ఉధృతంగా జరుగుతుంది. తాడేపల్లి గూడెంలో కాపు సామాజిక ప్రజలు బలంగా ఉన్నారు. వీరు ఎక్కువగా జనసేన టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారు. గౌడ్ సామాజిక వర్గం కూడా కూటమికే మొగ్గు చూపిస్తుంది.
ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే తాడేపల్లిగూడెం కూటమికి పూర్తిస్థాయిలో ఆదిపత్యం లభించే అవకాశం ఉంది. జనసేన పార్టీ కేటాయిస్తే అభ్యర్థి గా బొలిశెట్టి శ్రీనివాస్ కు ఎక్కువ అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. జనంలో ఉన్న మంచి ఇమేజ్ గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి జనసేన టిడిపి పొత్తులు ఇవన్నీ బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపును సున స్వయంగా చేస్తున్నట్లుగా జనం అభిప్రాయపడుతున్నారు. టిడిపి జనసేన పొత్తు గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిసారి కాపు సామాజిక వర్గ ఓట్లు టిడిపి వ్యతిరేకంగా పోల్ అయ్యేవి కాని ఈసారి అవన్నీ కూటమిలో భాగంగా పోల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పై కాపు రేవులను రెచ్చగొట్టడం పూర్తిస్థాయిలో వైసిపికి మైనస్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈసారి కూటమి అధికారంలోకి వస్తే పవన్ సీఎం అయిన అవ్వకపోయినా డిమాండ్ చేసి మరి కాపు రేవులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకోవచ్చు అన్న ఆలోచన ఎక్కువగా కాపు వర్గంలో ఉంది. ఇది కూటమికి మేలు చేయబోతుంది అని అంచనా వేస్తున్నారు. అయితే గూడెంలో ఈసారి జనసేన జెండా ఎగరడం ఖాయమని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.