Dead Body : గోనెసంచిలో మహిళ మృతదేహం.. ఎవరామే? వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 14 April 2023, 10:00 am

Dead Body : అదో నిర్మానుష్య ప్రదేశం. అక్కడే ఉన్న పొదల్లో ఒక ప్లాస్టిక్ సంచి పడి ఉంది. దాని నుంచి భయంకరమైన వాసన వస్తోంది. దీంతో అందులో ఏముందో అని అందరూ టెన్షన్ పడ్డారు. స్థానికులు భయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి ఆ ప్లాస్టిక్ సంచిని పరిశీలించి కత్తితో ఆ సంచిని కట్ చేసి చూసే సరికి అందరూ షాక్.

whose body is ther in that plastic bag

whose body is ther in that plastic bag

ఆ సంచిలో ఓ మృతదేహం ఉంది. అది మహిళ మృతదేహం. చీర కట్టుకొని ఉన్న ఆ మహిళను సంచిలో కుక్కి మరీ అక్కడ పడేశారు. రంగారెడ్డి జిల్లాలోని పహాడిషరీఫ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dead Body : ఇంతకీ ఎవరా మహిళ?

ఆ మహిళను మూడు రోజుల కిందనే హత్య చేసి సంచిలో కుక్కినట్టు తెలుస్తోంది. ఆ మహిళను ఎక్కడో మూడు రోజుల కింద అత్యాచారం చేసి హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి ఇక్కడికి తీసుకొచ్చి పొదల్లో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళ ఎవరు. అసలు ఈ రాష్ట్రానికి చెందిన మహిళేనా. లేక వేరే రాష్ట్రానికి చెందిన మహిళనా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp