విశాఖపట్నంలో దారుణం కాళ్లకు గొలుసులు కట్టేసి బాలికపై స్వామీజీ అత్యాచారం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

విశాఖపట్నంలో దారుణం కాళ్లకు గొలుసులు కట్టేసి బాలికపై స్వామీజీ అత్యాచారం..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :20 June 2023,4:00 pm

ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖపట్నం నగరంపై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో క్రైమ్ రేట్ పెరిగిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులను సైతం కిడ్నాప్ కి గురికావడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్నంలో జ్ఞానానంద ఆశ్రమంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆశ్రమంలో స్వామీజీ 15 సంవత్సరాల బాలికపై అత్యంత పైశాచికంగా కర్కసంగా అత్యాచారానికి పాల్పడటం జరిగింది. ఒక ఏడాది నుంచి బాలికను తన గదిలోనే కాళ్లకు గొలుసు వేసి బంధించేవాడట. ఆమె ఎదురు తిరిగితే కొట్టేవాడట.

ఆ బాలికకు ఆకలేస్తే రెండు చెంచాల అన్నాన్ని నీటితో కలిపి మాత్రమే పెట్టేవాడట. రెండు వారాలకు ఓసారి మాత్రమే స్నానానికి వెళ్లనిచ్చేవాడట. రాజమహేంద్రవరానికి చెందిన ఆ పదిహేను సంవత్సరాల బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో ఆమెను బంధువులు ఐదో తరగతి దాకా చదివించి రెండేళ్ల కిందట జ్ఞానానంద ఆశ్రమంలో సేవలు కోసం పంపించారు. అయితే ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ ఆ బాలికతో ఆవులకు మేత వేయించటం, తేడా తీయటం లాంటి పనులు చేయించేవాడు. అర్ధరాత్రి పూట బాలికను తనతో పాటు రూమ్ కు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఏడాది నుంచి బాలిక కాల గొలుసువేసి బంధించి కాలకృత్యాలకు కూడా అనుమతించేవాడు కాదట. ఈ రకంగా రెండేళ్లుగా బాలికను చిత్రహింసలకు గురి చేసేవాడట. ఈ నెల 13వ తేదీన పనిమనిషి సాయంతో బాధితురాలు ఆశ్రమం నుంచి బయటపడింది.

Purnanada Swamiji Arrest

Purnanada Swamiji Arrest

స్వామీజీ తనను చిత్రహింసలకు గురి చేసిన విషయాన్ని కంకిపాడు పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో బాలికను విజయవాడలోని దిశా పోలీస్ స్టేషన్ కు పంపారు. పూర్ణానంద స్వామీజీ పై ఫోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత విశాఖ పోలీసులు స్వామీజీని అరెస్టు చేయడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది