Avinash Reddy : అవినాష్ రెడ్డి – ఆయన తండ్రి మీద సిబిఐకి ఎందుకు అంత కక్ష?
Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చివరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకునేలా ఉంది. అవును.. ప్రస్తుతం సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. వివేకానంద హత్య కేసులో అసలు సూత్రధారులు వీళ్లే అని సీబీఐ గట్టిగా నమ్ముతోంది. నిందితుల విచారణ తర్వాత అసలు సూత్రధారులు వీళ్లే అని సీబీఐకి స్పష్టమైనా.. వాళ్లే నిందితులు అని చెప్పడానికి ఆధారాలు మాత్రం సేకరించలేకపోతోంది సీబీఐ. వీళ్లే అసలు దోషులు అని ఊరికే చెప్పలేం కదా. ఆ ఆరోపణలను నిజం చేయాలి అంటే.. ఖచ్చితమైన ఆధారాలు చూపించాలి.
కానీ.. సీబీఐ ఫెయిల్ అవుతోంది ఇక్కడే. వాళ్లే అసలైన దోషులు అని చెప్పాలంటే మామూలు విషయం కాదు. దానికి తగ్గ ఆధారాలు సేకరించాలి. అనుమానించినంత మాత్రాన కోర్టు నమ్మదు కదా. ఇప్పటి వరకు హత్య కేసులో అరెస్ట్ అయిన వాళ్లు, విచారణ ఎదుర్కొన్న వాళ్లు అందరూ అవినాష్ రెడ్డికి సన్నిహితులు అవడం వల్ల.. సీబీఐ ఆరోపణలకు ఇంకాస్త బలం చేకూరింది. వివేకా హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లంతా వివేకా హత్య సమయంలో అవినాష్ ఇంటి దగ్గరే ఉన్నారట. అధికారులు గూగుల్ టేకౌట్ అనే టెక్నాలజీని ఉపయోగించి ఈ విషయాన్ని నిర్ధారించారు.
Avinash Reddy : వివేకా హత్య సమయంలో వీళ్లంతా అవినాష్ ఇంటి దగ్గరే ఉన్నారట
ఈ హత్యలో ఒక ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రమే కాదు.. ఆయన తండ్రి కూడా కీలక పాత్ర పోషించారని సీబీఐ అనుమానిస్తోంది. అందుకే.. అవినాష్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారించింది. మరోసారి విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇచ్చినా తనకు కుదరదని చెప్పాను. అవినాష్ తో పాటు భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఈసారి ఎంపీ, ఆయన కొడుకు ఇద్దరినీ విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి వివేకా హత్య కేసు ఇంకెంత దూరం వెళ్తుందో?