Women’s Day : ప్రతి ఏటా మహిళా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్ని జరుపుకుంటాయి. ఈ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటాం. ఈ రోజున మహిళల సాంఘిక, ఆర్థిక సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తు చేసుకుంటాం. నిత్యజీవితంలో వారు రోజు ఎదుర్కొనే సమస్యలను ఎత్తి చూపడానికి మహిళలకు ప్రత్యేకంగా ఇవ్వబడ్డ ఒక అవకాశం ఈ మహిళ దినోత్సవం. ఆడ మగ అంతా ఒక్కటే అనే అంశాన్ని ప్రతి సంవత్సరం ఈరోజు గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటో చాలామందికి తెలియదు. అలాంటి వారికి THETELUGUNEWS స్పెషల్ స్టోరీ అందిస్తుంది.
మహిళా దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసుకోండి.ఫిబ్రవరి 8, 1909 సంవత్సరం నుంచి మహిళా దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. న్యూయార్క్‌లో వస్త్ర కార్మికుల సమ్మెను పురస్కరించుకుని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈ రోజును ఉమెన్స్ డే గా ప్రకటించింది. అయితే, అమెరికా ప్రకటన చేసినప్పటికీ ఎలాంటి వేడుకలు జరగలేదు. అయితే మొదటగా మహిళా దినోత్సవాలు 1911లో జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా యూరోపియా దేశాల మహిళలు ప్రదర్శనలో పాల్గొన్నారు. లక్ష మందికి పైగా మహిళలు ఓటు హక్కును కోరుతూ, ప్రభుత్వ ఆఫీసులను నిర్వహించే హక్కులను కోరుతూ రోడ్డుపై పోరాటం చేశారు. లింగ వివక్ష తొలగిపోవాలని, సమానమైన వేతనం ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు.
అలాగే మార్చి 8 ,1917 లో ఐరోపాలో మరో సంఘటన జరిగింది. సెయింట్ పీటర్ బర్గ్ లోని మహిళా వస్త్ర కార్మికులు రోడ్డుపైకి వచ్చి మహిళ హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ తర్వాత ఈ పోరాటం రష్యన్ విప్లవంగా అవతరించింది. దీంతో ఐక్యరాజ్యసమితి మార్చి 8న మహిళల ప్రత్యేకమైన రోజుగా ప్రకటించింది. ఆ రోజు నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో దూసుకెళుతున్నారు. మగవాళ్లకు పోటీగా ఎందులోనైనా తాము విజయం సాధించగలమని నిరూపిస్తున్నారు. మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.