Ramoji Rao : కడప అంటే రామోజీరావు కి ఇంత కక్ష ఎందుకు ? ఏం చేసాడో చూడండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ramoji Rao : కడప అంటే రామోజీరావు కి ఇంత కక్ష ఎందుకు ? ఏం చేసాడో చూడండి !

 Authored By sekhar | The Telugu News | Updated on :27 May 2023,11:00 am

Ramoji Rao : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట అని అందరికీ తెలుసు. మొదటి నుండి వైయస్ ఫ్యామిలీకి ఈ జిల్లాలో తిరుగులేని ఆదరణ ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప ఎంపీగా రికార్డు స్థాయిలో ఈ జిల్లా నుండి ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే అటువంటి ఈ జిల్లాపై ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కక్ష కట్టినట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది. మేటర్ లోకి వెళ్తే కడప జిల్లాపై ఈనాడు పేపర్ లో విషం చిమ్ముతూ కథనాలు ప్రచురితమవుతున్నాయి.

తాజాగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు దేశంలో ఎనిమిది కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషించదగ్గ విషయం. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం కోరింది. దీంతో వైఎస్ఆర్ జిల్లాలోని కడప నగరానికి అతి సమీపంలో ఉన్న కొప్పర్తిని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పరిణామం పై రామోజీరావు విశాఖపట్నం ఈనాడు పేపర్ లో కథనాలు ప్రచురించడం జరిగింది.

క‌డ‌ప‌పై రామోజీ క‌క్ష‌...ఇంత దుర్మార్గ‌మా?

అసలు అమరావతిని ప్రతిపాదిస్తేనే బాగుండేది ఎక్కడో కొప్పర్తిని ప్రతిపాదించింది జగన్ ప్రభుత్వమన్నట్టు ఈనాడు పత్రిక నిసిగ్గుగా… ఆర్టికల్ రాసుకొచ్చింది. ఎక్కడో వెనకబడిన కడప జిల్లాలో కొప్పర్తిని ప్రతిపాదించడం ఏమిటని ఈనాడు నిలదీస్తూ కథనం రాసింది. మరోపక్క ఇప్పటికే పారిశ్రామికంగా ఏపీ ప్రభుత్వం కొప్పర్తిని అభివృద్ధి చేస్తూ ఉంది. ఇటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన గొప్ప అవకాశాన్ని జగన్ ప్రభుత్వం అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకునే దిశగా… కొప్పర్తినీ అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదించడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది