Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని కాదని మరీ తెలుగుదేశంలో మహాసేన రాజేష్ చేరింది ‘ ఆ నియోజికవర్గ ‘ టికెట్ కోసమే?
Pawan Kalyan : ఓహో.. ఎట్టకేలకు మహాసేన రాజేశ్ టీడీపీ పార్టీలో చేరాడు. సైకిల్ ఎక్కేశాడు. చివరి క్షణం వరకు ఆయన ఏ పార్టీలో చేరుతారో అనే టెన్షన్ ఉండేది. కానీ.. చివరకు ఆయన టీడీపీ కండువానే కప్పేసుకున్నారు. నిజానికి ఆయన టీడీపీలో చేరుతున్నట్టు ముందే ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరి.. రాజేశ్ కు ఎమ్మెల్యే టికెట్ కన్ఫమ్ అయినట్టేనా? టికెట్ హామీతోనే టీడీపీలో చేరారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయంది.
నిజానికి.. టీడీపీతో కంటే కూడా జనసేనతో మహాసేనకు ఎక్కువ రిలేషన్ షిప్ ఉండేది. చాలాసార్లు జనసేన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కానీ.. చివరి నిమిషంలో మాత్రం జనసేన కాకుండా టీడీపీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. తాజాగా సామర్లకోట సమావేశంలో చంద్రబాబు సాక్షిగా ఆయన టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలప్పుడు చంద్రబాబును దళిత ద్రోహిగా జగన్ చిత్రీకరించారని.. అప్పుడు జగన్ మాటలను విని తాను చంద్రబాబును అపార్థం చేసుకున్నట్టు మహాసేన రాజేశ్ అన్నారు.
Pawan Kalyan : జగన్ మాటలు విని చంద్రబాబును అపార్థం చేసుకున్నా అని చెప్పిన రాజేశ్
అసలైన ద్రోహి ఎవరో తొందరగానే గ్రహించాము. అసలు.. టీడీపీ హయాంలో చంద్రబాబు.. దళితుల కోసం ఏకంగా 27 సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. కానీ.. జగన్ సీఎం అయ్యాక వాటిని రద్దు చేశారు. 2019 లో చంద్రబాబు మళ్లీ గెలిచి ఉంటే అమరావతి నిర్మాణం ఇప్పటికే పూర్తి అయి ఉండేది. చీకట్లో ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది. చంద్రబాబుది రామరాజ్యం అయితే.. జగన్ ది తుగ్లక్ పాలన అంటూ రాజేశ్ చెప్పుకొచ్చారు. ఇంతకీ రాజేశ్ కు ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ను చంద్రబాబు కన్ఫమ్ చేశారో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.