Railway Track : రాళ్లను ఎందుకు రైల్వే ట్రాక్ పక్కన వేస్తారు మీకు తెలుసా..
Railway Track : రైలు ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే రైలు ప్రయాణం ఒక అద్భుతమైన ప్రయాణం అని చెప్పాలి ఈ రైలు నిర్మాణాన్ని మహా అద్భుతం అనే చెప్పుకోవాలి.ఈ రైళ్లను బ్రిటిష్ వారి కాలం నుంచే ఈ రైల్వే వ్యవస్థ మనదేశంలో బలపడింది. బ్రిటిష్ వారి తరువాత రైల్వే అభివృద్ధి తక్కువగానే జరిగింది. ఈ రైల్వే నిర్మాణం కీలక నగరాల నుంచి చిన్న చిన్న నగరాల దాకా విస్తరించింది సంపద దోచుకోవడం కోసం అన్ని రకాల వ్యవస్థలను వాడుకున్నారు బ్రిటిష్ ప్రభుత్వం మన దేశ సంపదను తీసుకు వెళ్లడం కోసం ఈ రైల్వే నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఇక అసలు విషయానికి వద్దాం మనం రైళ్లను రైలు పట్టాలను చూస్తూ ఉంటాము. రైలు పట్టాల మీద రూపాయి బిళ్ళలను పెట్టి మీద రైలు వెళ్తుంటే తెగ సంతోష పడుతూ ఉంటాము. అని చాలామందికి రైలు పట్టాల మధ్య ఎందుకు రాళ్లను వేస్తారో అన్న విషయం గురించి ఎవరూ ఆలోచించరు. అందుకే ఇప్పుడు పట్టాల మధ్య రాళ్లను ఎందుకు వేస్తారు తీసుకుందాం..
ఈ రాళ్లనే ట్రాక్ బ్యాలస్ట్ అని పిలుస్తారు. ఈ బ్యాలస్ట్ ను గ్రానైట్, ట్రాప్ రాక్, క్వార్ట్జైట్, డోలమైట్ లేదా సున్నపురాయి యొక్క సహజ నిక్షేపాల నుండి ఉత్పత్తి చేస్తారు. ఇవి నాలుగు ప్రాథమిక ప్రయోజనాలకు ఉపయోగపడతాయి అవి ఏంటంటే
Railway track : అసలు విషయం ఇదే..
ఈ రాళ్ళు రైల్వే ట్రాక్ బరువును పంపిణీ చేయడంతో పాటు భరిస్తుంది కూడారైలు ప్రయాణించేటప్పుడు స్లీపర్ లను దృఢమైన స్థితిలో ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి
ట్రాక్ నుండి వచ్చినటువంటి నీటిని పట్టాల నుంచి దూరంగా ఉంచుతుంది.
ఎలాంటి చిన్న చిన్న మొక్కలు పెరగకుండా ఈ రాళ్ళు సహాయపడతాయి.
రైలు నుంచి వచ్చే భీకర శబ్దాలను ఈ రాళ్లు తగ్గించగలవు.
ఈ ఉపయోగాల కోసమే రైలు పట్టాల మధ్య రాళ్లను అటు ఇటు వేస్తుంటారు.