Home » Health » Why You Must Drink Water Immediately After Tea Or Coffee
Health

Tea | టీ, కాఫీ తర్వాత నీళ్లు త్రాగడం ఎందుకు తప్పనిస్సరి ..నిపుణుల సూచనలు

Authored By
Sam C
The Telugu News | Updated on: October 31, 2025 4:57 pm
Advertisement

Tea | ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీ ఇప్పుడు జీవితంలో విడదీయలేని భాగంగా మారాయి. ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీ తాగితేనే ఉత్సాహం వస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం, ఈ పానీయాలు తక్షణ శక్తిని ఇచ్చినా, తరచుగా తాగడం వల్ల శరీరంలో నీరు తగ్గి డీహైడ్రేషన్ సమస్యలు రావచ్చు. అందుకే టీ లేదా కాఫీ తాగిన వెంటనే నీరు త్రాగడం చాలా అవసరమని వారు హెచ్చరిస్తున్నారు.

Advertisement

#image_title

ఎప్పుడు నీరు తాగాలి?

Advertisement

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీ లేదా కాఫీ తాగే ముందు లేదా తర్వాత ఎప్పుడైనా నీరు తాగొచ్చు. అయితే తాగిన వెంటనే నీరు తాగడం అత్యంత మంచిది. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటంతో పాటు, అనేక చిన్న ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

టీ, కాఫీ తర్వాత నీరు తాగడం వల్ల కలిగే 5 ప్రధాన ప్రయోజనాలు

Advertisement

డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది
టీ, కాఫీల్లో కెఫిన్ ఉండటంతో శరీరం నుండి నీరు వేగంగా తగ్గిపోతుంది. తాగిన వెంటనే నీరు తాగడం ద్వారా ఆ తేమను తిరిగి సమతుల్యం చేయవచ్చు.

దంతాలపై మరకలు రాకుండా కాపాడుతుంది
టీ, కాఫీ తాగే వారికి దంతాలు పసుపు రంగులోకి మారడం సాధారణం. నీరు త్రాగడం వల్ల దంతాలపై పడిన కెఫిన్, టానిన్ పదార్థాలు కడిగి పోయి, పళ్లను శుభ్రంగా ఉంచుతుంది.

కావిటీల ప్రమాదం తగ్గిస్తుంది
చక్కెర కలిగిన టీ, కాఫీ తాగిన తర్వాత నీరు తాగడం ద్వారా దంతాలకు అంటుకున్న చక్కెర తొలగిపోతుంది. దీంతో బ్యాక్టీరియా పెరుగుదల తగ్గి కావిటీలను నివారిస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి