Killi Krupa Rani : కిల్లి కృపారాణి తలరాత మార్చబోతున్నాం వైఎస్ జగన్.. పర్ఫెక్ట్ స్కెచ్ ఇది..!
Killi Krupa Rani : కిల్లి కృపారాణి.. శ్రీకాకుళం జిల్లాలోనే తనకు ఉన్న ఫాలోయింగ్ వేరు. కాంగ్రెస్ ను వదిలేసి కృపారాణి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కృపారాణికి… వైఎస్ జగన్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. తను కూడా ఎలాంటి పదవులు పొందలేదు. తనకు కనీసం రాజ్యసభ పదవి అయినా వస్తుందని కృపారాణి ఆశించారు. కానీ.. ఆ పదవీ దక్కలేదు. ఇటీవల భర్తీ చేసిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో కృపారాణికి పదవి దక్కుతుందని అంతా భావించినా సీఎం జగన్ తనను పక్కన పెట్టేశారు.
నిజానికి.. కిల్లి కృపారాణిని సీఎం జగన్ వేరే విధంగా వినియోగించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కింజారపు కుటుంబానికి పోటీగా కృపారాణిని దించాలనేది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే ఆమెకు ఎటువంటి పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ తనను వెయిట్ చేయిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి.. కిల్లి కృపారాణి.. 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. తను శ్రీకాకుళంలోనే బలమైన సామాజిక వర్గం కళింగకు చెందిన నేత. తను కేంద్ర మంత్రిగానూ పని చేశారు.
Killi Krupa Rani : కింజారపు కుటుంబాన్ని దెబ్బకొట్టాలంటే కృపారాణి వల్లే అవుతుంది
శ్రీకాకుళం ఎంపీగా 1996 నుంచి 2009 వరకు ఎర్రనాయుడు ఉన్నారు. ఆయన మరణం తర్వాత రెండు సార్లు శ్రీకాకుళం ఎంపీగా ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అందుకే.. ఎలాగైనా కింజారపు కుటుంబాన్ని ఓడించేందుకు జగన్.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో శ్రీకాకుళంలో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
దీతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి కిల్లి కృపారాణి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే.. తనకు ఏ పదవి ఇవ్వకుండా జగన్ ఆమెను పదవులకు జగన్ దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. శ్రీకాకుళం అంతటా తిరిగి అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల మద్దతును పెంచుకోవాలని ఇప్పటికే జగన్.. ఆమెకు సూచించినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కిల్లి కృపారాణినే పోటీలోకి దించే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతోంది.