Chandrababu : చంద్రబాబుని నమ్ముకుంటే బూడిద మిగులుతుంది అని మళ్ళీ ప్రూవ్ అయ్యింది..!
Chandrababu : అసలు తెలంగాణలో ఇంకా టీడీపీ బతికే ఉందా? టీడీపీ బతికి ఉన్నా.. ఇక్కడ గెలిచే అవకాశాలు ఇంకా ఉన్నాయా? కనీసం ఒక్క సీటు అయినా తెలంగాణలో గెలిచే సత్తా ప్రస్తుతం టీడీపీకి ఉందా? ఇటీవల ఖమ్మం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగం విన్న తర్వాత చాలామంది టీడీపీ మాజీ నేతలకు అదే అనుమానం కలిగింది. అయితే.. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎలా మాట్లాడుతారు.. ఎన్నికల తర్వాత ఎలా మాట్లాడుతారు.. అనేది అందరికీ తెలుసు. ఆయన సంగతి తెలియని వాళ్లు ఎవ్వరూ లేరు. ఎన్నికల సమయంలో అయితే ప్రత్యర్థులపై పంచులతో రెచ్చిపోతారు. కానీ.. ఇటీవల ఖమ్మం సభలో మాత్రం ఏ పార్టీపై కూడా పల్లెత్తు మాట అనలేదు.
చివరకు అధికార పార్టీ టీఆర్ఎస్ పై కూడా విరుచుకుపడలేదు. ఇంకా ఎన్నికల సమయమే రాదు. ఇప్పుడు ప్రత్యర్థ పార్టీలను విమర్శించడానికే ఇంతగా భయపడుతున్న చంద్రబాబు నాయుడు రేపు ఎన్నికల కోసం మాట్లాడితే అప్పుడు విమర్శిస్తారా? అప్పుడేం మాట్లాడుతారు అని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో ఓ వెలుగు వెలిగి.. మంత్రులు అయి.. పదవులు అనుభవించి చివరకు టీడీపీనే వదిలేశారు కొందరు. ఇప్పుడు వేరే పార్టీలో పదవులు అనుభవిస్తున్నారు. నిజానికి ఖమ్మం సభకు రావాలని కూడా చంద్రబాబుకు ఇష్టం లేదట. కానీ.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఆయనతో భేటీ అయి.. ఒత్తిడి చేశారట. దీంతో ఆయన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఓకే చెప్పారట.
Chandrababu : కమ్మ నేతలు ఒత్తిడి చేస్తేనే ఖమ్మం సభకు వచ్చారా?
నిజానికి.. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటేనే చంద్రబాబు ప్రస్తుతం భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ పై ఎలా విమర్శలు చేస్తారు. అప్పట్లో ఓటుకు నోటు వ్యవహారం పెద్ద దెబ్బ తీసిన విషయం తెలిసిందే. అప్పుడే హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఏపీకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అవుతారని అందరూ అప్పట్లో భావించారు. చంద్రబాబు కూడా భయపడిపోయి హైదరాబాద్ నుంచి ఏపీకి పారిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని.. పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు తిరిగి రావాలని చంద్రబాబు ఏ నమ్మకంతో చెబుతున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.