
BJp
BJP : బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు దేశంలో బంపర్ విక్టరీ కొట్టింది భారతీయ జనతా పార్టీ. ముచ్చటగా మూడోస్సారీ అధికారం తమదేనని ప్రధాని నరేంద్ర మోడీ బలంగా నమ్ముతున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచి, అంతలోనే నరేంద్ర మోడీ ఏకంగా దేశానికే ప్రధాని అయ్యారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. అంతా ‘గుజరాత్ మోడల్’ చుట్టూ జరిగిన పబ్లిసిటీ పుణ్యమే. నరేంద్ర మోడీని వ్యతిరేకించడానికి, చాలా రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకులకు అప్పట్లో సరైన ‘పాయింట్’ దొరకలేదు. అదే సమయంలో, కాంగ్రెస్ పాలనతో జనం విసిగిపోయి వున్నారు. వెరసి, బీజేపీ బంపర్ విక్టరీ కొట్టి అధికార పీఠమెక్కింది..
కాంగ్రెస్ మీద ప్రజల్లో వున్న వ్యతిరేకత అస్సలు తగ్గకపోవడంతో, రెండోసారి కూడా బీజేపీ అధికారం కేంద్రంలో దక్కింది. పెద్ద నోట్ల రద్దుతో దేశం నడ్డి విరిచేసింది నరేంద్ర మోడీ సర్కారు. చెప్పుకుంటూ పోతే, ఇలాంటి అర్థం పర్థం లేని ప్రయోగాలు ప్రధాని నరేంద్ర మోడీ చాలానే చేశారు. దేశాన్ని నట్టేట్లో ముంచేశారు కూడా. దేశం గడచిన ఎనిమిదేళ్ళలో ఏం సాధించింది.? అంటే, సాధించినదానికన్నా పోగొట్టుకున్నదే ఎక్కువన్న చర్చ ఆర్థిక రంగ నిపుణుల్లో జరుగుతోంది. రైతులు, సామాన్యులు.. ఎవరూ సంతోషంగా లేరు. ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అందరికీ మోడీ సర్కారు వాత పెడుతూనే వుంది.
Will BJP Win Third Time In A Row
అయినాగానీ, మళ్ళీ బీజేపీదే అధికారమంటూ కమలనాథులు చెబుతున్నారంటే, ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేదని వాల్ళు బలంగా నమ్మబట్టే కదా.? తెలుగు రాష్ట్రాల్లో విభజన హామీల్ని ఎనిమిదేళ్ళయినా మోడీ సర్కారు నెరవేర్చలేదు. ఇదొక్కటి చాలు, గడచిన ఎనిమిదేళ్ళలో దేశానికి మోడీ సర్కారు చేసిందేమీ లేదని చెప్పడానికి. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఆ కేంద్రమే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఆదుకోవాల్సిన కేంద్రం, చేతులెత్తేసింది. అయినా, బీజేపీదే మళ్ళీ అధికారమట. ఇదెలా సాధ్యం.? మూడోసారి బీజేపీకి దేశంలో అధికారం రావడం అంత తేలిక కాదు. వస్తే మాత్రం, పెట్రోల్ ధర రెండొందలు దాటి ఆ పైకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.