BJP : బీజేపీకి ముచ్చటగా మూడోసారి అధికారం దక్కేనా.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BJP : బీజేపీకి ముచ్చటగా మూడోసారి అధికారం దక్కేనా.?

BJP : బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు దేశంలో బంపర్ విక్టరీ కొట్టింది భారతీయ జనతా పార్టీ. ముచ్చటగా మూడోస్సారీ అధికారం తమదేనని ప్రధాని నరేంద్ర మోడీ బలంగా నమ్ముతున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచి, అంతలోనే నరేంద్ర మోడీ ఏకంగా దేశానికే ప్రధాని అయ్యారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. అంతా ‘గుజరాత్ మోడల్’ చుట్టూ జరిగిన పబ్లిసిటీ పుణ్యమే. నరేంద్ర మోడీని వ్యతిరేకించడానికి, చాలా రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకులకు అప్పట్లో సరైన ‘పాయింట్’ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 June 2022,6:00 am

BJP : బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు దేశంలో బంపర్ విక్టరీ కొట్టింది భారతీయ జనతా పార్టీ. ముచ్చటగా మూడోస్సారీ అధికారం తమదేనని ప్రధాని నరేంద్ర మోడీ బలంగా నమ్ముతున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచి, అంతలోనే నరేంద్ర మోడీ ఏకంగా దేశానికే ప్రధాని అయ్యారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. అంతా ‘గుజరాత్ మోడల్’ చుట్టూ జరిగిన పబ్లిసిటీ పుణ్యమే. నరేంద్ర మోడీని వ్యతిరేకించడానికి, చాలా రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకులకు అప్పట్లో సరైన ‘పాయింట్’ దొరకలేదు. అదే సమయంలో, కాంగ్రెస్ పాలనతో జనం విసిగిపోయి వున్నారు. వెరసి, బీజేపీ బంపర్ విక్టరీ కొట్టి అధికార పీఠమెక్కింది..

కాంగ్రెస్ మీద ప్రజల్లో వున్న వ్యతిరేకత అస్సలు తగ్గకపోవడంతో, రెండోసారి కూడా బీజేపీ అధికారం కేంద్రంలో దక్కింది.  పెద్ద నోట్ల రద్దుతో దేశం నడ్డి విరిచేసింది నరేంద్ర మోడీ సర్కారు. చెప్పుకుంటూ పోతే, ఇలాంటి అర్థం పర్థం లేని ప్రయోగాలు ప్రధాని నరేంద్ర మోడీ చాలానే చేశారు. దేశాన్ని నట్టేట్లో ముంచేశారు కూడా. దేశం గడచిన ఎనిమిదేళ్ళలో ఏం సాధించింది.? అంటే, సాధించినదానికన్నా పోగొట్టుకున్నదే ఎక్కువన్న చర్చ ఆర్థిక రంగ నిపుణుల్లో జరుగుతోంది. రైతులు, సామాన్యులు.. ఎవరూ సంతోషంగా లేరు. ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అందరికీ మోడీ సర్కారు వాత పెడుతూనే వుంది.

Will BJP Win Third Time In A Row

Will BJP Win Third Time In A Row

అయినాగానీ, మళ్ళీ బీజేపీదే అధికారమంటూ కమలనాథులు చెబుతున్నారంటే, ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేదని వాల్ళు బలంగా నమ్మబట్టే కదా.? తెలుగు రాష్ట్రాల్లో విభజన హామీల్ని ఎనిమిదేళ్ళయినా మోడీ సర్కారు నెరవేర్చలేదు. ఇదొక్కటి చాలు, గడచిన ఎనిమిదేళ్ళలో దేశానికి మోడీ సర్కారు చేసిందేమీ లేదని చెప్పడానికి. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఆ కేంద్రమే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఆదుకోవాల్సిన కేంద్రం, చేతులెత్తేసింది. అయినా, బీజేపీదే మళ్ళీ అధికారమట. ఇదెలా సాధ్యం.? మూడోసారి బీజేపీకి దేశంలో అధికారం రావడం అంత తేలిక కాదు. వస్తే మాత్రం, పెట్రోల్ ధర రెండొందలు దాటి ఆ పైకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది