Etela Rajender : ఈటల కొత్త పార్టీ పెడితే ఎవరికి లాభం.. నిపుణులు ఏమంటున్నారంటే..?
Etela Rajender : ఈటల రాజేందర్.. ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్. తెలంగాణ రాజకీయాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయంటే దానికి కారణం ఈటల రాజేందర్. మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ఆయన ఒకే ఒక దెబ్బతో మాజీ మంత్రి అయ్యారు. ఆయన్ను సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాంటూ టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను కోరడం గమనార్హం. ఈనేపథ్యంలో ఈటల రాజేందర్ పార్టీలో ఉండే సమస్యే లేదు. ఇవాళో రేపో ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామ చేస్తారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
మరోవైపు ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడుతారని వార్తలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ వేరే పార్టీలో చేరడం కన్నా.. కొత్త పార్టీ పెడితేనే బాగుంటుందని… ఆయన అనుచరులు, అభిమానులు కూడా అంటున్నారు. తన సన్నిహితులు కూడా కొత్త పార్టీ పెడితేనే బెటర్ అన్నట్టుగా స్పందిస్తున్నారని తెలుస్తోంది. ఈటల వర్గం ప్రస్తుతం అదే పనిలో ఉంది. కొందరు బీసీ నేతలతోనూ కొత్త పార్టీపై చర్చిస్తోంది. చాలావరకు ఎవరిని సంప్రదించినా కొత్త పార్టీ పెడితేనే బెటర్ అన్నట్టుగా చెబుతున్నారట.
Etela Rajender : బీసీ వర్గాలే ఎజెండాగా కొత్త పార్టీ?
ఈటల రాజేందర్ పెట్టబోయే కొత్త పార్టీ బీసీ వర్గాల అభ్యున్నతే ఎజెండాగా ఉండాలని భావిస్తున్నారట. అంతా బాగానే ఉంది కానీ… ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడితే మాత్రం… ఆయన పెట్టే పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్ కు లాభం చేకూర్చుతుంది కానీ.. నష్టం చేకూర్చదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ఒకవేళ ఈటల పార్టీ పెడితే.. ఎక్కువ మంది ఇతర పార్టీలకు చెందిన నేతలు అందులో చేరుతారని… టీఆర్ఎస్ నేతలెవ్వరూ అందులో చేరరని.. భవిష్యత్తులో ఏవైనా ఎన్నికలు వచ్చినా… వేరే పార్టీలకు పడే ఓట్లు చీలిపోయి… ఈటలకు పడటం వల్ల.. అది టీఆర్ఎస్ కు లాభం చేకూర్చుతుందని.. ఎందుకంటే.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకు అలాగే ఉంటుంది కాబట్టి… కేవలం ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్లు చీల్చేందుకే ఈటల పార్టీ ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Etela Rajender : రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు?
ఏది ఏమైనా.. ఈటల రాజేందర్ ఉన్నపళంగా పార్టీ పెట్టినా… 2023 ఎన్నికల లోపు పార్టీ పెట్టినా.. అది ఖచ్చితంగా సీఎం కేసీఆర్ కే లాభం చేకూర్చుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలోని మంత్రులు, ఇతర నాయకులందరూ ఈటలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈటలకు, ఈటల వర్గానికి టీఆర్ఎస్ పార్టీ శత్రువు అయిపోయింది. టీఆర్ఎస్ నాయకులు కూడా ఈటలకు శత్రువులు అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈటల పార్టీ పెట్టినా.. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క కార్యకర్త కూడా చేరడు. కాకపోతే.. వేరే పార్టీలకు చెందిన నేతలు, టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు చేరితే చేరొచ్చు. దాని వల్ల టీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు.. వేరే పార్టీల ఓట్లు చీలడం తప్ప… టీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు ఏమాత్రం ఈటల పార్టీ వల్ల ఎఫెక్ట్ కాదన.. ఎఫెక్ట్ అయ్యేది వేరే పార్టీలకే అని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.