Pawan Kalyan : గాజువాక పేరు చెప్తే పవన్ రియాక్షన్ ఏంటి .. మళ్ళీ పోటీ చేసే దమ్ము ఉందా ?
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ పెట్టి దాదాపు 8 ఏళ్లు కావస్తోంది. కానీ.. ఇప్పటి వరకు పార్టీకి అతీగతీ లేదు. పార్టీకి సరైన పాపులారిటీ లేదు. అధినేత పవనే 2019 ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేస్తే ఒక్క స్థానంలోనూ ఎమ్మెల్యేగా గెలవలేదు. ఆయన పోటీ చేసిన స్థానాల్లో వైజాగ్ జిల్లాలోని గాజువాక ఒకటి. 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుతో జనసేన సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది నిజంగా జనసేనకు చెంపపెట్టులాంటిదే. కానీ.. 2024 ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు ఉండవని.. ఈసారి జనసేన చాలా సీట్లు గెలుస్తుందనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. గత ఎన్నికల్లో ఓడిపోయిన గాజువాక నుంచే మళ్లీ పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
జనసేన నేతలు, పవన్ అభిమానులు కూడా మరోసారి గాజువాక నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా ఆయన్ను గెలిపించుకుంటామని, భారీ మెజారిటీతో పవన్ ను గెలిపించి తీరుతామని చెబుతున్నారు. ఇదివరకు కూడా పార్టీ నేతల మాట వినే పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేశాడు. కానీ.. ఏమైంది.. ఓడిపోయాడు.
Pawan Kalyan : గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమంటున్నాడు?
మరోవైపు గాజువాకలో గత ఎన్నికల్లో పవన్ మీద గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాత్రం ఈసారి కూడా వైసీపీనే గెలుస్తుందని చెబుతున్నాడు. తాను గెలిచినప్పటి నుంచి జనంలోనే ఉంటున్నానని.. మూడున్నరేళ్లుగా గాజువాక ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నానని చెబుతున్నాడు. గాజువాకలో మళ్లీ తిప్పల కుటుంబం జెండానే ఎగురుతుందని బల్ల గుద్ది మరీ వైసీపీ మహిళా నాయకురాలు రోజారాణి చెబుతోంది. పేదల కోసం ఎంతో చేస్తున్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అని.. ఎన్నికల్లో ఓడిపోగానే.. గాజువాక వైపు కూడా చూడలేదు.
గాజువాకను పట్టించుకోని పవన్ ను ప్రజలు మళ్లీ ఎందుకు ఎన్నుకుంటారు అంటూ రోజారాణి ప్రశ్నించారు. ఈసారి భారీ మెజారిటీతో గాజువాకలో వైసీపీ గెలుస్తుందని ఆమె జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పవన్ పోటీ చేసినా తమ పార్టీ విజయానికి ఎలాంటి ఢోకా ఉండదు.. అని రోజా రాణి నొక్కి మరీ చెప్పారు. మరి.. ఆమె వ్యాఖ్యలపై జనసైనికులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.