Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

 Authored By sandeep | The Telugu News | Updated on :28 September 2025,6:00 pm

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య సేన త‌హ‌త‌హ‌లాడుతుంది. మ‌రి కొద్ది గంట‌ల‌లో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే టోర్నమెంట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో తలపడటం ఇదే తొలిసారి. కాబట్టి ఈ ఫైనల్ చాలా ప్రత్యేకమైనది. నిజానికి, టీం ఇండియా ఆసియా కప్ ఫైనల్ గెలిచి మళ్లీ ట్రోఫీ అందుకుంటుంది. కానీ ట్రోఫీ కెప్టెన్‌కు అందించే సమయంలో సూర్య దానిని అంగీకరించకపోవచ్చు.

#image_title

కార‌ణాలు ఏంటి?

అందుకు ప్ర‌ధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ.. ACC ఛైర్మన్‌గా ఉండటంతో పాటు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు, పాకిస్తాన్ ప్రభుత్వ అంతర్గత మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. ప్ర‌స్తుతం భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా టీం ఇండియా ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అధికారులతో ఎటువంటి హ్యాండ్ షేక్‌లు లాంటివి ఇవ్వ‌డం లేదు.

మ‌రి ఇలాంటి స‌మ‌యంలో మొహ్సిన్ నఖ్వీ ఫైనల్ విన్నర్‌కు ట్రోఫీని అందజేస్తే టీమ్ ఇండియా దాన్ని బహిష్కరిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.. పాకిస్తాన్‌లో నఖ్వీ మూలాలు టీమ్ ఇండియా ప్రస్తుత వైఖరికి ఆటంకం కలిగిస్తున్నాయి. అతడు టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టేలా చేసే వ్యాఖ్యలకు.. అటు ఫ్యాన్స్, ఇటు బీసీసీఐ మండిపడుతున్నారు.చూడాలి మ‌రి, ఫైనల్ తర్వాత ప్రెజెంటేషన్ వేడుకలో ఎవరు ట్రోఫీని ప్రదానం చేస్తారు.! ఎవరు స్వీకరిస్తారు.! అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది