Home » Andhra Pradesh » Will Ys Jagan Control Ycp Leaders To Stop Talking Nonsense
andhra pradesh

YS Jagan : ఆ నేతలను వైఎస్ జగన్ కంట్రోల్ చేయలేరా? జనం నిలదీస్తున్నా పట్టించుకోరా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: September 13, 2022, 1:30 pm
Advertisement

YS Jagan : ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొందరు వైసీపీ నేతలు అయితే రెచ్చిపోతున్నారు. ఎంతలా అంటే.. వైఎస్ జగన్ కు ఇవన్నీ తెలుసా? తెలియదా? తెలిసే సైలెంట్ గా ఉంటున్నారా అనేది తెలియక జనాలు నెత్తి పీక్కుంటున్నారు. అలా… ఏపీలో తన నోటికి ఏది వస్తే అది మాట్లాడే నేతల్లో ఒకరు కొడాలి నాని. మంత్రి వర్గ విస్తరణలో ఆయన్ను మంత్రి పదవి నుంచి జగన్ తప్పించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. కొడాలి నాని తన నోటికి మాత్రం ప్లాస్టర్ వేయలేదు. ఆయన వ్యవహార శైలి ఇప్పటికీ వైసీపీకి మచ్చ తెస్తోంది.

Advertisement

అసలు కావాలని సీఎం జగనే కొడాలి నానితో ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేయిస్తున్నారా అనే డౌటనుమానం ప్రజల్లో వస్తోంది. టీడీపీ నేతలపై కొడాలి నాని చేసే వ్యాఖ్యలను ఏపీ ప్రజలు వినలేకపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ మీద ఆయన చేసే వ్యాఖ్యలు మామూలుగా ఉండవు. రెచ్చిపోయి మరీ వాళ్లను విమర్శిస్తాడు కొడాలి నాని. ముఖ్యంగా నారా లోకేశ్ పుట్టుక మీద అయితే లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలను చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అలా అని టీడీపీ ఏం తక్కువ తినలేదు.

will ys jagan control ycp leaders to stop talking nonsense

Advertisement

YS Jagan : టీడీపీ ఏం తక్కువ తినలేదు

వైఎస్ జగన్ మీద టీడీపీ నేతలు కూడా తీవ్రంగానే విమర్శలు చేస్తున్నారు. కానీ.. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల కంటే కూడా కొడాలి నాని చేసే వ్యాఖ్యలు మాత్రం చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయని జనాలు అంటున్నారు. కొడాలి నాని ఇలా రెచ్చిపోయి టీడీపీ అధినేత మీద, నారా లోకేశ్ మీద వ్యాఖ్యలు చేయడం వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. చివరకు ఉన్న ఓటు బ్యాంకు కూడా పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఒక ముఖ్యమంత్రిగా, వైసీపీ అధినేతగా వైఎస్ జగన్ ఎందుకు రెస్పాండ్ అవడం లేదు. ఆ నోటి దరిద్రాన్ని వైఎస్ జగన్ ఆపకపోతే.. చివరకు వైఎస్ జగన్ మీద కూడా అలాంటి ప్రశ్నలనే సంధించేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి