Categories: NewsTelangana

Wines | మందుబాబుల‌కి అల‌ర్ట్.. రెండు రోజుల పాటు వైన్స్ బంద్

Wines | గణేశ్ ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు రెండు రోజులు మూత‌ప‌డ‌నున్నాయి. సెప్టెంబ‌ర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్ లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.

#image_title

వైన్స్ బంద్..

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. ఆదిలాబాద్‌లో ఈ నెల 4వ తేదీ నుంచి.. అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి.. 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రాంతాలవారీగా వైన్ షాపులు బంద్ చేయాలని స్థానిక అధికారులు ఆదేశించారు. పెద్దపల్లితో సహా పలు జిల్లాల్లో ఈనెల 5న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తీసుకున్నారు.

ఈ నెల 6, 7 తేదీలలో హైదరాబాద్ నగరంలో భారీగా వినాయక నిమజ్జనం జరగనుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీన జరగనుంది. ట్యాంక్ బండ్‌పై ఈ రెండు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనికి అనుగుణంగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలను అమలు చేయనున్నారు. నిమజ్జనం కార్యక్రమం సులభంగా.. భద్రంగా జరిగేలా పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. సెప్టెంబర్ 6న నిర్వహించే ఈ శోభాయాత్రకు కేంద్ర హోం మంత్రి అబిత్ షా రానున్నారు.

Recent Posts

Pulivendula Bypoll : పులివెందులకు ఉపఎన్నిక ఖాయం..జగన్ కు ఇదే అగ్ని పరీక్ష

By-elections are certain for Pulivendula : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి…

5 hours ago

Kavitha Arrest : కవిత ను అరెస్ట్ చేయడం వల్లే బిఆర్ఎస్ నుండి బయటకు వచ్చా – కడియం కీలక వ్యాఖ్యలు

Kadiyam Srihari Shocking Comments On Kalvakuntal Kavitha : కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా…

6 hours ago

Ganesh Immersion : గణేశ్ నిమజ్జనం వేళ బాంబు బెదిరింపులు..పోలీసులు అలర్ట్

ముంబై పోలీసులు గణేష్ నిమజ్జనం (Ganesh Immersion) నేపథ్యంలో హై అలర్ట్‌లో ఉన్నారు. నిమజ్జన వేడుకల్లో విధ్వంసం సృష్టిస్తామని వారికి…

7 hours ago

Women’s Big Fighting : యూరియా కోసం నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

Urea Shortage Telangana : తెలంగాణలో యూరియా కొరత కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులు ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చాయి.…

8 hours ago

Male Entry to Women Washroom : బుర్ఖా ధరించి లేడీస్ బాత్రూమ్లోకి వెళ్లిన వ్యక్తి!

Male Entry to Women Washroom : కరీంనగర్ శివారులోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బుర్ఖా ధరించి ఒక…

8 hours ago

AP Assembly Sessions : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్

AP Assembly Sessions : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం…

9 hours ago

Snakes | వీళ్లేం మ‌నుషులు.. ఊరేగింపులో పాములతో డ్యాన్సులు.. చివరికి..!

Snakes | రాజస్థాన్‌ రాష్ట్రంలో ప్రజల ప్రాచీన నమ్మకాలు, ఆచారాలు ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి.అక్కడి ప్రజలు ప్రతి ఏడాది…

10 hours ago

Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం..కేబినెట్ కీలక నిర్ణయం

Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి అర్హ కుటుంబానికి…

11 hours ago