Wines | మందుబాబుల‌కి అల‌ర్ట్.. రెండు రోజుల పాటు వైన్స్ బంద్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wines | మందుబాబుల‌కి అల‌ర్ట్.. రెండు రోజుల పాటు వైన్స్ బంద్

 Authored By sandeep | The Telugu News | Updated on :5 September 2025,12:00 pm

Wines | గణేశ్ ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు రెండు రోజులు మూత‌ప‌డ‌నున్నాయి. సెప్టెంబ‌ర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్ లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.

#image_title

వైన్స్ బంద్..

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. ఆదిలాబాద్‌లో ఈ నెల 4వ తేదీ నుంచి.. అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి.. 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రాంతాలవారీగా వైన్ షాపులు బంద్ చేయాలని స్థానిక అధికారులు ఆదేశించారు. పెద్దపల్లితో సహా పలు జిల్లాల్లో ఈనెల 5న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తీసుకున్నారు.

ఈ నెల 6, 7 తేదీలలో హైదరాబాద్ నగరంలో భారీగా వినాయక నిమజ్జనం జరగనుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీన జరగనుంది. ట్యాంక్ బండ్‌పై ఈ రెండు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనికి అనుగుణంగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలను అమలు చేయనున్నారు. నిమజ్జనం కార్యక్రమం సులభంగా.. భద్రంగా జరిగేలా పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. సెప్టెంబర్ 6న నిర్వహించే ఈ శోభాయాత్రకు కేంద్ర హోం మంత్రి అబిత్ షా రానున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది