Uber Cabs : ఆలస్యంగా గమ్యం చేర్చిన ఉబర్ క్యాబ్.. రూ.20 వేలు జరిమానా విధించిన కోర్టు.. ప్రయాణికురాలికి రూ.20 వేలు చెల్లించిన ఉబర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Uber Cabs : ఆలస్యంగా గమ్యం చేర్చిన ఉబర్ క్యాబ్.. రూ.20 వేలు జరిమానా విధించిన కోర్టు.. ప్రయాణికురాలికి రూ.20 వేలు చెల్లించిన ఉబర్

Uber Cabs : సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా మంది క్యాబ్ బుక్ చేసుకుంటారు. అది ఎక్కడైనా సాధారణమే. అలాగే అనుకున్న సమయానికి క్యాబ్ ఒక్కోసారి రాదు. ట్రాఫిక్ జామ్ వల్లనో.. లేక రూట్ సరిగ్గా తెలియకనో ఒక్కోసారి క్యాబ్ రావడం ఆలస్యం అవుతుంది. అప్పుడు చేరాల్సిన గమ్యం కూడా కొంచెం లేట్ అయితే కావచ్చు కానీ.. తాను ఆలస్యంగా వెళ్లడం వల్ల అందుకోవాల్సిన విమానం మిస్ అయిందని ఓ మహిళ ఏకంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 November 2022,1:40 pm

Uber Cabs : సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా మంది క్యాబ్ బుక్ చేసుకుంటారు. అది ఎక్కడైనా సాధారణమే. అలాగే అనుకున్న సమయానికి క్యాబ్ ఒక్కోసారి రాదు. ట్రాఫిక్ జామ్ వల్లనో.. లేక రూట్ సరిగ్గా తెలియకనో ఒక్కోసారి క్యాబ్ రావడం ఆలస్యం అవుతుంది. అప్పుడు చేరాల్సిన గమ్యం కూడా కొంచెం లేట్ అయితే కావచ్చు కానీ.. తాను ఆలస్యంగా వెళ్లడం వల్ల అందుకోవాల్సిన విమానం మిస్ అయిందని ఓ మహిళ ఏకంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది. దాని వల్ల తాను చాలా నష్టపోయానంటూ ఫిర్యాదులో పేర్కొనడంతో దానిపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం క్యాబ్ సంస్థకు ఫైన్ విధించింది.

ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. కవిత శర్మ అనే మహిళ జూన్ 12, 2018 న చెన్నైకి వెళ్లేందుకు బయలుదేరింది. ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. యాప్ లో సూచించిన సమయం కంటే కూడా క్యాబ్ 14 నిమిషాలు లేట్ గా వచ్చింది. అంతే కాదు.. క్యాబ్ డ్రైవర్ నెమ్మదిగా కారును నడపడంతో పాటు ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడంతో కారు అనుకున్న సమయానికంటే కూడా లేటుగా విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో తను ఎక్కాల్సిన చెన్నై విమానం మిస్ అయింది. దీంతో మరో విమానంలో తాను చెన్నైకి వెళ్లాల్సి వచ్చిందని.. కేవలం క్యాబ్ డ్రైవర్ వల్ల తాను చాలా నష్టపోయానంటూ వెంటనే కవిత శర్మ వినియోగదారుల ఫోరమ్ లో ఫిర్యాదు చేసింది.

woman passenger to get rs 20000 who missed the flight because of cab late

woman passenger to get rs 20000 who missed the flight because of cab late

Uber Cabs : కోర్టు ఖర్చుల కింద రూ.10 వేలు, మహిళకు రూ.10 వేలు

ఆమె ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు.. ముందు ఉబర్ కంపెనీకి నోటీసులు పంపించింది. కానీ.. ఉబర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె వెంటనే థానే జిల్లా వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించింది. వెంటనే ఉబర్ కంపెనీకి కమిషన్ రూ.20 వేల జరిమానా విదించింది. అందులో రూ.10 వేలు కోర్టు ఖర్చుల కోసం, మరో రూ.10 వేలు మహిళా ప్రయాణికురాలికి చెల్లించాలని సంస్థకు రూ.20 వేల జరిమానా విధించింది.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది