
woman passenger to get rs 20000 who missed the flight because of cab late
Uber Cabs : సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా మంది క్యాబ్ బుక్ చేసుకుంటారు. అది ఎక్కడైనా సాధారణమే. అలాగే అనుకున్న సమయానికి క్యాబ్ ఒక్కోసారి రాదు. ట్రాఫిక్ జామ్ వల్లనో.. లేక రూట్ సరిగ్గా తెలియకనో ఒక్కోసారి క్యాబ్ రావడం ఆలస్యం అవుతుంది. అప్పుడు చేరాల్సిన గమ్యం కూడా కొంచెం లేట్ అయితే కావచ్చు కానీ.. తాను ఆలస్యంగా వెళ్లడం వల్ల అందుకోవాల్సిన విమానం మిస్ అయిందని ఓ మహిళ ఏకంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది. దాని వల్ల తాను చాలా నష్టపోయానంటూ ఫిర్యాదులో పేర్కొనడంతో దానిపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం క్యాబ్ సంస్థకు ఫైన్ విధించింది.
ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. కవిత శర్మ అనే మహిళ జూన్ 12, 2018 న చెన్నైకి వెళ్లేందుకు బయలుదేరింది. ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. యాప్ లో సూచించిన సమయం కంటే కూడా క్యాబ్ 14 నిమిషాలు లేట్ గా వచ్చింది. అంతే కాదు.. క్యాబ్ డ్రైవర్ నెమ్మదిగా కారును నడపడంతో పాటు ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడంతో కారు అనుకున్న సమయానికంటే కూడా లేటుగా విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో తను ఎక్కాల్సిన చెన్నై విమానం మిస్ అయింది. దీంతో మరో విమానంలో తాను చెన్నైకి వెళ్లాల్సి వచ్చిందని.. కేవలం క్యాబ్ డ్రైవర్ వల్ల తాను చాలా నష్టపోయానంటూ వెంటనే కవిత శర్మ వినియోగదారుల ఫోరమ్ లో ఫిర్యాదు చేసింది.
woman passenger to get rs 20000 who missed the flight because of cab late
ఆమె ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు.. ముందు ఉబర్ కంపెనీకి నోటీసులు పంపించింది. కానీ.. ఉబర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె వెంటనే థానే జిల్లా వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించింది. వెంటనే ఉబర్ కంపెనీకి కమిషన్ రూ.20 వేల జరిమానా విదించింది. అందులో రూ.10 వేలు కోర్టు ఖర్చుల కోసం, మరో రూ.10 వేలు మహిళా ప్రయాణికురాలికి చెల్లించాలని సంస్థకు రూ.20 వేల జరిమానా విధించింది.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.