woman travels 10000 kms to destroy love lock
Love Lock : ప్రేమ.. ఈ రెండక్షరాల పదానికి అవధులు లేవు. ప్రేమను వర్ణించడం ఎవరి తరం కాదు. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు. ఎలా బ్రేకప్ అవుతుందో తెలియదు. అందుకే.. ప్రేమలో ఉన్నవాళ్లు.. కలిసి ఉన్నంత వరకే వాళ్ల జీవితం. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కసారి ఆ ప్రేమ జంట మధ్య ప్రేమ పోయిందంటే.. ఎవరి జీవితం వారిది. ఎవరి బతుకు వారిది. ఎంత దగ్గర చేస్తుందో.. అంత దూరం చేస్తుంది ప్రేమ. అదే ప్రేమకు ఉన్న పవర్.
woman travels 10000 kms to destroy love lock
ఇప్పుడు ఈ ప్రేమ గురించి ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఓ యువతి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన లవ్ బ్రేకప్ అయిపోయింది. దీంతో తన ప్రేమికుడి మీద కోపంతో తను ఏం చేసింది అనేదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తను ప్రేమలో ఉన్నప్పుడు తన ప్రేమికుడు ఓ తాళాన్ని తనకు ఇచ్చాడట. దాన్ని పగులగొట్టేందుకు తను ఏకంగా 10 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. అర్థం కాలేదా? వివరంగా తెలుసుకుందాం రండి.
లాసీ యంగ్ అనే యువతి.. దక్షిణ కొరియాకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు.. తనకు 2019లో సియోల్ టవర్ వద్ద ఒక లాక్ ను బహుమతిగా ఇచ్చారు. అది లవ్ లాక్. దాన్ని అక్కడ ప్రేమకు చిహ్నంగా అందరూ ఇస్తుంటారు. అలాగే.. లాసీ యంగ్ ప్రియుడు కూడా అలాగే తనకు లవ్ లాక్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. లాక్ కు తాళం వేశాక ఎంత గట్టిగా ఉంటుందో.. ప్రేమ కూడా అంతే గట్టిగా ఉండాలని భావించి లాక్ గిఫ్ట్ గా ఇస్తుంటారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. తర్వాత వీళ్ల లవ్ బ్రేకప్ అయింది. దీంతో.. తన ప్రేమకు చిహ్నంగా మాజీ ప్రియుడు ఇచ్చిన తాళాన్ని పగలగొట్టాలని భావించింది లాసీ. కానీ.. ఆ లాక్ దక్షిణ కొరియాలో ఉంది. తను ప్రస్తుతం యూఎస్ లోని లాస్ ఏంజెల్స్ లో ఉంది. అక్కడి నుంచి దక్షిణ కొరియాకు దూరం 10 వేల కిలోమీటర్లు. అయినా కూడా ఆ లాక్ ను బ్రేక్ చేయడం కోసం.. ఏకంగా కరోనా సమయంలో 10 వేల కిలోమీటర్లు ప్రయాణించింది ఆ యువతి. అక్కడికి వెళ్లి మరీ.. లాక్ ను పగులగొట్టి.. తన లవ్ కు సూపర్ డూపర్ బ్రేకప్ చెప్పేసింది.
తను ఎలా లాస్ ఏంజెల్స్ నుంచి దక్షిణ కొరియాకు వెళ్లి.. అక్కడ లాక్ పగులగొట్టిందో దానికి సంబంధించి ఓ వీడియో తీసి టిక్ టాక్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన వీడియోను టిక్ టాక్ లో 5 మిలియన్ల యూజర్లు చూశారు. లాస్ ఎంజెల్స్ నుంచి పసిఫిక్ మహాసముద్రం మీదుగా.. దక్షిణ కొరియా చేరుకొని.. తాళాన్ని పగులగొట్టి.. తన లవ్ కు సూపర్ బ్రేకప్ చెప్పిందని నెటిజన్లు కూడా తనకు మద్దతు ప్రకటిస్తున్నారు.
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
This website uses cookies.