Women : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల కిందటే ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ తెచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారికి స్కాలర్‌షిప్ అందించారు. రీసెంట్‌గా ఎల్ఐసీ బీమా సఖి యోజన కూడా అమలులోకి తీసుకొచ్చారు. మహిళా సాధికారికత కోసం ఈ స్కీమ్ లాంఛ్ చేసింది. మహిళా సాధికారికత కార్యక్రమంలో భాగంగానే.. రాబోయే 12 నెలలు అంటే సంవత్సర కాలంలో లక్ష మంది బీమా సఖిల్ని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎల్ఐసీ సోమవారం రోజు తెలిపింది.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం మరియు వారికి స్థిరమైన ఆదాయ అవకాశాలను అందించడం. మహిళల్లో బీమా, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా బీమా సఖిలకు స్టైఫండ్ కోసం రూ. 840 కోట్ల వరకు వెచ్చించనున్నట్లు తెలుస్తుంది. బీమా సఖిగా నియమితులైన మహిళలకు.. బీమా రంగంలో కనీసం మూడేళ్లు శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్‌లో తొలి ఏడాది ప్రతి నెలా రూ. 7 వేలు స్టైఫండ్ ఇస్తారు. రెండో సంవత్సరంలో ప్రతి నెలా రూ. 6 వేల చొప్పున, మూడో ఏడాదిలో ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తారు.ఇక విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత.. సదరు మహిళలు ఎల్ఐసీ ఏజెంట్లుగా పనిచేయొచ్చు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఎల్ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా కూడా అవకాశం లభిస్తుందని చెప్పొచ్చు. పదో తరగతి పాసైన 18-70 ఏళ్ల వరకు వయసున్న మహిళలు.. ఎల్ఐసీ వెబ్‌సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్లలో.. ఆపైన మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. సమాజంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సహా ఆర్థిక అక్షరాస్యత, బీమాపైన అవగాహన కల్పించడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం .అధికారిక LIC వెబ్‌సైట్‌ను సందర్శించి, రిక్రూట్‌మెంట్ విభాగానికి నావిగేట్ చేయండి . ఆ తర్వాత LIC’s BIMA SAKHI Recruitment” పై క్లిక్ చేయండి . త్త రిక్రూట్‌మెంట్‌ల కోసం అపాయింట్‌మెంట్ సర్టిఫికేట్‌లను ప్రధానమంత్రి పంపిణీ చేస్తారు
Death Clock APPs : టైటిల్ చూసి కాస్త షాకింగ్ గా ఉన్నా ఇది కొంత ప్రభావితం చూపించే అవకాశం…
Record Movie : టాలీవుడ్ నుంచి మొదలు పెడితే బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలు ఒక…
CM Revanth Reddy : అల్లు అర్జున్ అరెస్ట్ కి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి ఈగో హర్ట్…
Prabhas Raja Saab : రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమా ప్రస్తుతం సెట్స్…
Pushpa 2 : అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప2. చిత్రంలో రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన…
Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారడం మనం చూశాం. దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్…
Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే భార్య అంచనాలు…
Balakrishna Jana Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. శుక్రవారం మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్…
This website uses cookies.