Costliest Wine : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్ ఇది.. దీని ధర, స్పెషాలిటీ తెలిస్తే నోరెళ్లబెడతారు?
Costliest Wine : ప్రస్తుతం మద్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. ఏ రాష్ట్రంలో చూసినా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే మద్యం అమ్మకాల వల్ల వచ్చే ట్యాక్స్ ల తోనే రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి పనులను చేపడుతున్నాయి. పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఒక్క రోజు మద్యం అమ్మకపోయినా.. ప్రభుత్వానికి కోట్లలో లాస్ వస్తుంది. అందుకే.. ఏది ఏమైనా.. మద్యం అమ్మకాలను మాత్రం ప్రభుత్వాలు ఆపవు. ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే తప్ప. ఓవైపు కరోనా సెకండ్ వేవ్.. ఉద్ధృతంగా విజృంభిస్తున్నా… మద్యం దుకాణాలను మాత్రం ప్రభుత్వాలను మూసేయడం లేదంటే.. మద్యం షాపులు ప్రభుత్వాలకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు.
ఇక అసలు విషయానికి వస్తే… మామూలు ఒక ఫుల్ బాటిల్ మద్యం ధర ఎంతుంటుంది.. మా.. అంటే ఓ వెయ్యి రూపాయలు వేసుకోండి. మరీ కాస్ట్ లీ మందు అయితే ఓ పది వేలు వేసుకోండి. కానీ… లక్షల రూపాయల ధర అయితే ఉండదు కదా.. లక్షల రూపాయలు కాదు.. ఓ పుల్ బాటిల్ వైన్ ధర 7. 5 కోట్లు. ఆశ్చర్యపోయారా? అవును.. మీరు విన్నది నిజమే. ఒక్క ఫుల్ బాటిల్ ధరే అది.
దీనిపేరు పెట్రస్ 2000. దీని ధర 7.5 కోట్లుగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దాన్ని అంతరిక్షంలో పులియబెట్టడమే. అది ఫ్రెంచ్ వైన్. ఐఎస్ఎస్ తెలుసు కదా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. అక్కడే ఈ వైన్ బాటిల్ ను పులియబెట్టారట. ఇప్పుడు ఈ బాటిల్ ను క్రిస్టీన్ అనే సంస్థ వేలం వేస్తే… దీనికి ఒక మిలియన్ డాలర్ల ధర పలికిందట. అంటే మన కరెన్సీలో సుమారుగా 7.5 కోట్లు అన్నమాట.
Costliest Wine : మరో 30 ఏళ్ల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండే వైన్
ఈ వైన్ ఇప్పుడే కాదు.. ఇంకో 30 ఏళ్ల వరకు అలాగే ఉంటుందట. ఎన్నేళ్లు దాచి తాగితే అంత రుచి పెరుగుతుందట. 2019 లో స్పేస్ కార్గో అన్ లిమిటెడ్ అనే సంస్థ తమ పరిశోధనల్లో భాగంగా.. 12 వైన్ బాటిళ్లను అంతరిక్షంలోకి పంపిందట. అక్కడే సంవత్సరం పాటు ఉంచి.. భూమ్మీదకు తీసుకొచ్చాక.. ఆ వైన్స్ బాటిళ్లకు టేస్ట్ పరీక్షలు చేశారట. పెట్రస్ 2000 అనే వైన్ బాటిల్ రుచి అద్భుతంగా ఉందట. అందుకే ఆ బాటిల్ ను కొనుక్కోవడం కోసం జనాలు ఎగబడుతున్నారట. అందుకే అంత ధర. దీన్ని ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యంత విలువైన, కాస్ట్ లీ వైన్ గా రికార్డుకెక్కించారు.