Revanth Reddy | ఏంటి రేవంత్ రెడ్డికి మద్యంతో పాటు ఇతర అలవాట్లు ఏవి లేవా.. ఎందుకో తెలుసా?
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జీవితంలో మద్యం, ధూమపానం వంటి దురలవాట్లకు ఎందుకు దూరంగా ఉన్నారన్న విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Revanth Reddy : రేవంత్ మరికాస్త సీరియస్‌గా దృష్టి సారించాల్సిందేనా?
పెంపకమే ప్రధాన కారణం
హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, నాకు చిన్నప్పటి నుంచి మద్యం తాగే ఆలోచనే రాలేదు. నా పెంపకం, కుటుంబ విలువలే మద్యం నుంచి నన్ను దూరంగా ఉంచాయి. సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా, నలుగురికి ఆదర్శంగా ఉండాలనుకునే వ్యక్తిగా మద్యం వంటి అలవాట్లకు చోటు ఇవ్వలేను. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండటం నా స్వభావం” అని స్పష్టంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. “రెవంత్ రెడ్డికి సిగరెట్, బీరు, విస్కీ, డ్రగ్స్ వంటి ఏవైనా దురలవాట్లు లేవు. ఆయన శ్రద్ధ ఫుట్‌బాల్ మీదే ఉంటుంది. నేటి యువతకు ఆయన నిజమైన ఆదర్శం” అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, పలువురు నెటిజన్లు రేవంత్ రెడ్డిని ఆదర్శ నాయకుడిగా కొనియాడుతున్నారు.