Xiaomi 17 Pro Max vs iPhone 17 Pro Max | iPhone 17 Pro Maxకి గట్టిపోటీగా Xiaomi 17 Pro Max లాంచ్.. ధరలో అరవై శాతం తక్కువ
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ మొదలైంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న Apple తన తాజా ఫ్లాగ్‌షిప్ iPhone 17 Pro Maxను ఇటీవల విడుదల చేయగా, వెంటనే దానికి గట్టి పోటీగా Xiaomi 17 Pro Max లాంచ్ అయింది. రెండు ఫోన్‌లు కెమెరా సెటప్, ప్రాసెసర్, డిస్‌ప్లే పరంగా చాలా బాగా ఉన్నప్పటికీ, వాటి ధరలు, బ్యాటరీ సామర్థ్యం, సెకండరీ ఫీచర్ల పరంగా పెద్ద తేడా ఉంది.

#image_title
డిస్‌ప్లే
iPhone 17 Pro Maxలో 6.9 అంగుళాల Super Retina XDR డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఇది అత్యున్నత విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.
Xiaomi 17 Pro Maxలో అదే పరిమాణంలోని 6.9 అంగుళాల 2K డిస్‌ప్లేతో పాటు వెనుక భాగంలో ప్రత్యేకమైన M10 మ్యాజిక్ బ్యాక్ స్క్రీన్ ఉంటుంది. దీని సహాయంతో వెనుక కెమెరాతో సెల్ఫీలు, గేమింగ్, అలారంలు సెట్ చేయొచ్చు.
ప్రాసెసర్
iPhone 17 Pro Maxలో అత్యాధునికమైన A19 Pro 3nm చిప్‌సెట్ వినియోగించగా, Xiaomi 17 Pro Maxలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 (3nm) ప్రాసెసర్ వాడారు. రెండింటి పనితీరు తలసమానమేనని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
కెమెరా సెటప్
iPhone 17 Pro Maxలో 48MP + 48MP + 48MP ట్రిపుల్ రియర్ కెమెరాలు, ముందు భాగంలో 18MP సెల్ఫీ కెమెరా ఉంది.
Xiaomi 17 Pro Maxలో అయితే మరింత అధిక సామర్థ్యంతో 50MP (లైకా బ్రాండెడ్) ట్రిపుల్ కెమెరాలు, ముందు భాగంలో కూడా 50MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం విశేషం.
బ్యాటరీ & ఛార్జింగ్
iPhone 17 Pro Maxలో మోడల్‌ను బట్టి 4,832mAh నుంచి 5,088mAh వరకు బ్యాటరీ ఉంది.
Xiaomi 17 Pro Maxలో మాత్రం 7,500mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటి హైఎండ్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.
ధర పరంగా వ్యత్యాసం
iPhone 17 Pro Max ధరలు:
256GB – ₹1,49,900
512GB – ₹1,69,900
1TB – ₹1,89,900
2TB – ₹2,29,900
Xiaomi 17 Pro Max ధరలు:
12GB + 512GB – ₹74,700
16GB + 512GB – ₹78,500
16GB + 1TB – ₹87,200