బ్యాడ్ మూడ్ లో ఉన్న వైసీపీ శ్రేణులకి – జగన్ బిగ్ హ్యాపీన్యూస్ చెప్పాడు
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏది చేసినా ఒక ట్రెండ్ సృష్టిస్తారు. రికార్డు క్రియేట్ చేస్తారు. ఆయన ప్రవేశపెట్టే పథకాలైనా.. ఇంకేదైనా.. ట్రెండ్ సెట్ చేసి భావితరాలకు బాటను చూపుతారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు నాడు.. అంటే డిసెంబర్ 21న రక్తదాన శిబిరాన్ని వైసీపీ కార్యకర్తలు నిర్వహించారు. అయితే.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలను నిర్వహించగా.. వాటిని భారీగా రెస్పాన్స్ రావడంతో పాటు.. వేల కొద్ది జగన్ అభిమానులు ఆరోజు రక్తాన్ని దానం చేశారు.
దీంతో.. ఒకే రోజు వేల మంది రక్తదానం చేసినందుకు.. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్.. వైసీపీ పార్టీకి సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి తెలిపారు.
అయితే.. రక్తదాన శిబిరాన్ని ఏదో ఆర్బాటం కోసం, ప్రచారం కోసం నిర్వహించలేదని.. ఒక మంచి పని కోసం.. నిర్వహించామని.. రక్తం కొరత లేకుండా ఉండేందుకు అన్ని బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రులకు బ్లడ్ ను పంపించినట్టు అప్పిరెడ్డి స్పష్టం చేశారు.
ఏపీలోనే కాకుండా.. ఎక్కడ వీలైతే అక్కడికి అవసరం ఉన్నవాళ్లకు రక్తాన్ని పంపిస్తున్నామని అప్పిరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలను పార్టీ తరుపున చేస్తామని ఆయన అన్నారు.
12153 లీటర్ల రక్తం సేకరణ
జగన్ పుట్టిన రోజు నాడు ముందుగా ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినా.. తర్వాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ జగన్ అభిమానులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో మొత్తం 278 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించగా… మొత్తం 34723 యూనిట్ల రక్తాన్ని ఆరోజు సేకరించారు. అంటే మొత్తం 12,153 లీటర్ల రక్తాన్ని ఒక్కరోజే సేకరించి వైసీపీ రికార్డు క్రియేట్ చేసింది.