Tirupati by poll : ఏంటో.. వైసీపీకి అన్నీ అలా కలిసొస్తున్నాయ్? వైసీపీ టైమ్ బాగుంది?
Tirupati by poll : మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు గుర్తుందా మీకు. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందంటారు కదా. ఇది వైసీపీ టైమ్. అవును… వైసీపీకి ప్రస్తుతం అన్నీ అలా కలిసొస్తున్నాయ్. వైసీపీకి ప్రస్తుతం అన్నీ మంచి శకునాలే. 2019 నుంచి వైసీపీ జాతకమే మారింది. వరుస విజయాలు, ప్రశంసలు తప్పితే ఎక్కడా ఎదురు దెబ్బలు లేవు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీకే ప్రజలు జేజేలు పలికారు. త్వరలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగనుంది. అయితే… ఈ ఎన్నికలు కూడా వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే… తిరుపతికి ప్రస్తుతం రిజర్వ్ డ్ స్థానం అయిన ఎస్సీకి సంబంధించిన ఓట్లు వైసీపీకే ఎక్కువ ఉండటం. నిజానికి ఎస్సీ అంటే అందులో మాదిగ, మాల… రెండు వర్గాలు ఉంటాయి. మాదిగల ఓటు బ్యాంకు టీడీపీకి ఎక్కువగా ఉంటే.. మాల ఓటు బ్యాంకు.. వైసీపీకి ఎక్కువుంది.
అయితే…. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మాత్రం మాదిగ వర్గానికి చెందిన వారు కాగా…. మిగితా అభ్యర్థులు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్… అందరూ మాల వర్గానికి చెందనవారే.
చంద్రబాబు కావాలని…. మాల వర్గం నేతకు టికెట్ ఇచ్చి… వైసీపీ ఓట్లను చీల్చాలనుకున్నారు. కానీ… బీజేపీ మాదిగ వర్గానికి టికెట్ ఇవ్వడంతో.. మాదిగ ఓట్లు ఎక్కువ బీజేపీకి పడనున్నట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీకి ఉన్న మాదిగల ఓటు బ్యాంకు కాస్త చీలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల.. వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదు. వైసీపీకి ఉన్న మాలల ఓటు బ్యాంక్ అలాగే ఉంటుంది. వాళ్ల ఓట్లు వైసీపీకే పడిపోతాయి. దీంతో వైసీపీ కళ్లు మూసుకొని తిరుపతి ఉపఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Tirupati by poll : వైసీపీ, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది
అయితే… బీజేపీ అన్ని పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించాక… అప్పుడు తీరిగ్గా రత్నప్రభను రంగంలోకి దింపింది. ఇదంతా కావాలని వైసీపీ ఆడిన నాటకం అని… వైసీపీ, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని.. అందుకే బీజేపీ… కావాలని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇచ్చిందని. కావాలని టీడీపీ ఓటు బ్యాంక్ ను చీల్చడం కోసం చేసిన పనే అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నా.. వాళ్లను పట్టించుకునే నాథుడు మాత్రం లేడు.
ఏది ఏమైనా… తిరుపతి ఉపఎన్నిక పరిణామాలు మొత్తం వైసీపీకే అనుకూలంగా ఉండటంతో.. వైసీపీ ముఖ్య నేతలు కాలు మీద కాలేసుకొని.. తిరుపతి ఉపఎన్నిక సరళిని గమనిస్తున్నారు. వైసీపీ తిరుపతి ఉపఎన్నికల్లో గెలవడమే కాదు… బంపర్ మెజారిటీ రావడం ఖాయమంటూ జోస్యం చెబుతున్నారు. చూద్దాం మరి… తిరుపతి ఉపఎన్నిక సీటు ఎవరికి రాసి పెట్టిఉందో?