MLA Roja : వైసీపీకి దూరం అవుతున్న రోజా? ఇదిగో ప్రూఫ్?
MLA Roja గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. తను వైసీపీలోనే ఫైర్ బ్రాండ్. ఓ వైపు సినిమా ఇండస్ట్రీలో నటిగా రాణిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీ అయిపోయింది రోజా. రెండు డిఫరెంట్ ఫీల్డ్స్ లో రాణిస్తూ.. అందరి ప్రశంసలు అందుకుంటోంది రోజా. తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు. అందుకే.. తనకు రెండు సార్లు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టారు నగరి ప్రజలు.
అయితే.. వైసీపీలో ఎంతో ప్రాధాన్యత ఉన్న రోజా.. ఎందుకో ఈమధ్య పార్టీకి దూరం అవుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి.. తనకు మంత్రి పదవి రావాల్సింది కానీ.. కొన్ని సమీకరణల వల్ల తనకు మంత్రి పదవి దక్కలేదు కానీ.. వేరే పదవిని ఇచ్చి రోజాను శాంతింపజేశారు సీఎం జగన్.
తను ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ కోసం ఎంతో కృషి చేసింది. ఎదుటి వ్యక్తి ఎంతటి వారు అయినా సరే.. తన పదునైన వ్యాఖ్యలతో ధీటైన సమాధానం ఇవ్వగల సత్తా ఉన్న నేత రోజా. అందుకే.. తను ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీకి కొండంత అండ.
ప్రస్తుతం వైసీపీలోనూ కీలక పాత్ర పోషిస్తున్న రోజా.. ఆ పార్టీకి దూరం అవుతున్నట్టు తెలుస్తోంది. దానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయట.
MLA Roja : మంత్రి పెద్దిరెడ్డి పిలిచినా లైట్ తీసుకున్న రోజా?
ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొన్నది. ఈ నేపథ్యంలో తిరుపతిలో వైసీపీ నేతలు పార్టీ సమన్వయ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఆయన సమక్షంలో నిర్వహించిన ఈ మీటింగ్ కు చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు. కానీ.. రోజా మాత్ర హాజరు కాలేదు. తను చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే కాబట్టి.. మంత్రి పెద్దిరెడ్డి.. స్వయంగా ఆహ్వానించారట. అయినా కూడా తనకు హాజరు కాలేదు.. అనే ప్రచారం జోరుగా సాగడంతో.. వైసీపీకి రోజా దూరం అవుతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
నగరి నియోజకవర్గానికి చెందిన మరో వైసీపీ నేత నారాయణ స్వామికి, రోజాకు ఈమధ్య పడటం లేదని.. ఇద్దరి మధ్య వార్ మొదలైందని.. అందులోనూ కొందరు మంత్రులు కావాలని రోజాను పార్టీలో దురం పెడుతున్నారని.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రోజా.. కావాలని పార్టీకి దూరం అవుతున్నారని తెలుస్తోంది.
త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలోనూ రోజాను తీసుకోకుండా ఉండేందుకు కొందరు మంత్రులు రోజా గురించి తప్పుడు సమాచారాన్ని సీఎం జగన్ కు అందించారని.. ఇలా.. రోజాను జగన్ ముందు బ్యాడ్ చేసి.. రోజాను పార్టీకి దూరం చేయాలని కొందరు మంత్రులు తెగ ప్రయత్నిస్తున్నారట. దానితో పాటు తనకు మంత్రి పదవి రాకపోవడంతో.. లోలోపల రోజా కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట.
వీటన్నంటినీ గమనిస్తే.. రోజా ఇంకా కొన్నేళ్ల వరకు పార్టీలో సైలెంట్ అయిపోయి.. తన ప్రాధాన్యతను పార్టీకి తెలియజెప్పాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో?