TDP vs Pawan Kalyan : జగన్ నెత్తిన పాలు పోస్తూ.. టీడీపీ vs పవన్ కల్యాణ్ గేమ్ మొదలైంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP vs Pawan Kalyan : జగన్ నెత్తిన పాలు పోస్తూ.. టీడీపీ vs పవన్ కల్యాణ్ గేమ్ మొదలైంది..!

TDP vs Pawan Kalyan : ఏపీలో ప్రస్తుతం రాజకీయాలకు జనసేన కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఎందుకంటే అధికార వైసీపీ పార్టీని ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉంటారు. ఎలాగూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోస్తున్నారు కాబట్టి అది టీడీపీకి ప్లస్ అవుతుందని భావించింది. రాజకీయంగా తమకు ప్లస్ అవుతుందని భావించారు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఫోకస్ అయ్యారు. టీడీపీ కాస్త […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 November 2022,7:00 pm

TDP vs Pawan Kalyan : ఏపీలో ప్రస్తుతం రాజకీయాలకు జనసేన కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఎందుకంటే అధికార వైసీపీ పార్టీని ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉంటారు. ఎలాగూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోస్తున్నారు కాబట్టి అది టీడీపీకి ప్లస్ అవుతుందని భావించింది. రాజకీయంగా తమకు ప్లస్ అవుతుందని భావించారు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఫోకస్ అయ్యారు. టీడీపీ కాస్త సైలెంట్ అయినట్టు కనిపించింది. మరోవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ కావడంతో ఇక టీడీపీ,

జనసేన పొత్తు కన్ఫమ్ అయినట్టే అని అంతా అనుకున్నారు. నిజానికి బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. కానీ.. బీజేపీ నుంచి తను అనుకున్న సహకారం పవన్ కు ఎప్పుడూ లభించలేదు. అందుకే చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ నడవాలని అనుకున్నట్టు అందరూ అనుకున్నారు. కానీ.. ఇంతలోనే టీడీపీకి షాకిచ్చేలా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ అవడంతో టీడీపీకి షాక్ అయినంత పని అయింది. ఇటీవల ఏపీలో పర్యటించిన ప్రధాని మోదీ.. పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయారు.

yellow media again started attack on janasena and pawan kalyan

yellow media again started attack on janasena and pawan kalyan

TDP vs Pawan Kalyan : ప్రధాని మోదీతో పవన్ భేటీ అవడంతో టీడీపీ షాక్

జనసేనకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. దీంతో ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది. ఇదంతా తెర వెనుక నుంచి టీడీపీ నడిపిస్తున్న మైండ్ గేమ్ అని అర్థం అయింది. జనసేనానిపై టీడీపీ.. ఎల్లో మీడియా ద్వారా టార్గెట్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి నడుస్తా అని క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇంతలోనే పవన్ పై తీవ్రస్థాయిలో దాడికి ఎల్లో మీడియా తెగబడటంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నట్టు అర్థం అవుతోంది. చూద్దాం మరి భవిష్యత్తులో పవన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో?

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది