PPF Scheme : పీపీఎఫ్ స్కీం ద్వారా రోజుకు రూ.400 కడితే మీరూ కోటీశ్వరులు కావొచ్చు..!
PPF scheme : మార్కెట్లో చాలా మంది డబ్బులను వివిధ రూపాల్లో పెట్టబుడలు పెడుతుంటారు. కొందరేమో షేర్ మార్కెట్స్‌లో పెట్టుబడి పెడితే మరికొందరు మ్యూచువల్ ఫండ్స్, బంగారం, ఈక్విటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మరికొందరు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మొగ్గుచూపుతుంటారు. వీటిలో కొన్నింటిలో హై రిస్క్ అండ్ హై రిటర్న్, మీడియం రిస్క్ హై రిటర్న్స్ కూడా ఉంటాయి. మనం ఇప్పుడు మాట్లాడుకునే పీపీఎఫ్ ( పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) స్కీంలో మాత్రం రిటర్న్స్ మాత్రమే ఉంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో లావీదేవీలు జరుగుతుంటాయి. ఇందులో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని సంపాదించుకోవచ్చు.
ఈ స్కీంలో పెట్టుబడి పెట్టిన వారికి పన్ను (TAX) నుంచి మినహాయింపు కూడా వస్తుంది.పీపీఎఫ్ స్కీమ్ అనేది ప్రభుత్వ హామీ కలిగిన స్మాల్ సేవింగ్ స్కీమ్. ఇందులో డబ్బులు పెట్టినప్పుడు కానీ తీసుకునే టప్పుడు కానీ పన్ను కట్ అవ్వదు. మినహాయింపు ఉంటుంది. వడ్డీకి వడ్డీ మరియు రిటర్న్స్ కూడా వస్తాయి. రోజుకు రూ.400 లేదా నెలకు 12,500 వరకు చెల్లిస్తే చాలు. ప్రస్తుతం దీనిపై 7.1 శాతం వడ్డీ వస్తోంది. ఇందులో ఒకేసారి లేదా వాయిదాల రూపంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఇందులో ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.1.5లక్షల పెట్టుబడి పెట్టవచ్చును. దీనికి 15 ఏళ్లు మెచూరిటీ టర్మ్ ఉంటుంది. ఇందులో చేరితే ఉద్యోగులు ఏడాదికి రూ.1.5లక్షలు పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీ దీనికి ప్రయోజనం చేకూరుస్తుంది.

millionaire for less rs 400 per day through ppf scheme
PPF scheme : ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి
ఈ స్కీంపై వడ్డీ రేట్లను కేంద్రం సవరిస్తుంటుంది. ఒక్కోసారి పెరగచ్చు లేదా తగ్గొచ్చు.. స్థిరంగా కూడా ఉండొచ్చు. నెలకు 12,500 చొప్పున 30 ఏళ్లు పెట్టుబడి పెడితే మెచురిటీ అనంతరం మీ చేతికి రూ.1.54 కోట్లు వస్తాయి. ఇందులో మీరు పెట్టుబడి పెట్టింది 45 లక్షలు అవుతే మిగతా కోటి రాబడి అవుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే ఇంకా ఎక్కువ డబ్బులు రావొచ్చు. అందుకే ఈ పథకం గురించి ఆలోచించండి.. ఇందులో తక్కువ రిస్క్, కేంద్ర ప్రభుత్వం భరోసా కూడా ఉంటుంది.