ఓ యువతి.. వయసు 21 ఏళ్లే. కానీ.. అప్పటికే తను ఎవ్వరూ చేయలేని పని చేసింది. 21 ఏళ్ల యువతి అంటే ఎలా ఉండాలి. కుర్రకారు వెంటపడుతున్నా.. పట్టించుకోకుండా.. చదువు మీద, ఉద్యోగం మీద దృష్టి పెట్టాలి కానీ.. తను మాత్రం వాటికి పూర్తిగా విరుద్ధం. 21 ఏళ్లకే ఏకంగా 13 పెళ్లిళ్లు చేసుకుంది. నమ్మబుద్ధి కావడం లేదు కదా. అక్కడి ప్రజలు కూడా ఈ విషయం తెలిసి నమ్మడం లేదు. అసలు ఏం జరిగింది? తను 13 పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంది? తనది ఎక్కడ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.
అయితే.. తను 13 పెళ్లిళ్లు చేసుకోవడానికి తనొక్కతే కష్టపడలేదు. తను 13 పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక తన తల్లితో పాటు తన సోదరుడు కూడా ఉన్నాడు. 13 పెళ్లిళ్లు చేసుకొని.. 14 వ పెళ్లికి రెడీ అవుతున్న ఆ యువతి అడ్డంగా దొరికిపోయింది. ఒకవేళ దొరక్కపోయి ఉంటే.. ఇంకా ఎన్ని పెళ్లిళ్లు చేసుకునేదో ఆ యువతి. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన సోనూ గురించే మనం మాట్లాడుకునేది.
ఈనెల 6 వ తేదీన తనకు 13 వ వివాహం జరిగింది. నందుర్భర్ జిల్లాకు చెందిన భూషణ్ అనే వ్యక్తితో తనకు వివాహం జరగగా.. కేవలం 10 రోజులు మాత్రమే అతడితో సంసారం చేసింది. ఆ తర్వాత జంప్ అయిపోయింది. వెంటనే తనకు మరో వివాహాన్ని సెట్ చేశారు ఆమె తల్లి, సోదరుడు.
మే 16న 13 వ భర్త ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది సోనూ. అయితే.. తన భార్య కనిపించడం లేదంటూ ఆమె భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే.. సోనూ మాత్రం.. అదే జిల్లాకు చెందిన ఇంకొకరితో 14 వ పెళ్లికి సిద్ధం అయింది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లి విచారణ ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సోనూ.. వెంటనే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకొని.. ఇంకో గ్రామానికి మకాం మార్చింది. తను వేరే గ్రామానికి వెళ్లిన విషయం తెలుసుకున్న పోలీసులు.. స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో… వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సోనూను వల పన్ని పట్టుకున్నారు. అయితే.. సోనూ తల్లి, సోదరుడు మాత్రం పరారీలో ఉన్నారు.
పెళ్లి చేసుకోవడం, పెళ్లి కొడుకును దోచుకోవడం.. అతడిని వదిలేసి.. మరో పెళ్లి చేసుకోవడం.. తనకు పెళ్లిని తన తల్లి, సోదరుడు సెట్ చేయడం.. ఇదే వాళ్ల పని. అలా అలవాటు పడి.. 13 పెళ్లిళ్లు చేసుకున్న సోనూ.. చివరకు 14 వ పెళ్లి విషయంలో తొందరపడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. వామ్మో.. అంటూ ముక్కున వేలేసుకున్నారు.
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
This website uses cookies.