young man calls MLA on audio is viral
young man : సాధారణంగా ప్రజాక్షేత్రంలో ఎన్నికైన ఎంపీలకు మరియు ఎమ్మెల్యేలకు ప్రజలు తమ సమస్యలు తెలియజేస్తారు. ప్రభుత్వం నుండి జరగాల్సిన పనులు ఇంకా రోడ్డు సమస్యలు… మౌలిక సదుపాయాలు గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో తిరుగుతూ.. ప్రజా సమస్యలు కూడా తెలుసుకుంటారు. ఈ క్రమంలో వారి దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించేవి అయితే… అప్పుడే పరిష్కరిస్తారు. లేదా దానికి చేయాల్సిన పరిష్కారం వివరిస్తూ ఉంటారు. ఈ రకంగా ప్రజాప్రతినిధులకు ప్రజల మధ్య సంభాషణ ఉంటూ ఉంటది. కానీ మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యేకి వింత అనుభవం ఎదురయింది.
విషయంలోకి వెళ్తే మహారాష్ట్రలోని కన్నడ నియోజకవర్గ శివసేన పార్టీకి చెందిన వ్యక్తి ఉద్దవ్ థాకరే మద్దతుదారుడు ఎమ్మెల్యే ఉదయ్ సింగ్ రాజ్ పుత్ ఖుల్తాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా అదే నియోజకవర్గంలోని ఖుల్తాబాద్ కి చెందిన ఓ యువకుడు తనకి ఎనిమిది నుండి తొమ్మిది ఎకరాల పొలం ఉన్న ఎవరూ పిల్లనివ్వడం లేదని తనకి అమ్మాయిని వెతికి పెట్టాలంటూ సదరు ఎమ్మెల్యేకి ఫోన్ లో తన బాధను తెలియజేసుకున్నాడు. ఈ క్రమంలో మొదట ఒకసారిగా షాక్ అయినా ఎమ్మెల్యే ఉదయ సింగ్ తరువాత… ఆ యువకుడి బాధను అర్థం చేసుకుని అతడికి సరైన
young man calls MLA on audio is viral
అమ్మాయిని వెతికి పెడతానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఆడియో మహారాష్ట్ర రాజకీయాలలో వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో కూడా రావటంతో సంచలనగా మారడంతో మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యే ఉదయ సింగ్ నీ ప్రశ్నించగా ఇది వాస్తవమే అని అంగీకరించారు. ఇటువంటి ఫోన్ కాల్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి. పట్టణాలలో కంటే గ్రామీణ ప్రాంతాలలో పెళ్లికాని మగ పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆస్తులు ఉంటున్నా గానీ ఆడపిల్లల పేరెంట్స్…గ్రామాలలో ఉన్న మగవారికి పెళ్లి చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలిపారు. అదే సిటీలో స్థిరపడ్డ అబ్బాయిలకు మాత్రం ఆడపిల్లనివ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.