Veera Simha Reddy Movie Review : అఖండ చిత్రం తర్వాత బాలకృష్ణ, Balakrishna, నుండి వస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ, Gopichand Malineni, Nandamuri Balakrishna, కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం జనవరి 12న విడులవుతోంది. శ్రుతి హాసన్, Shruti Haasan, కథానాయికగా నటించగా, దునియా విజయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇక చిత్రం నుంచి విడుదలైన మాస్ సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన మాస్ సాంగ్స్‌ను అభిమానులు వీర లెవెల్‌లో ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
నటీనటులు: బాలకృష్ణ, శృతిహాసన్, దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, నవీన్ చంద్ర, లాల్
దర్శకుడు: గోపిచంద్ మలినేని
మ్యూజిక్: థమన్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్
రిలీజ్ తేది: జనవరి 12,2023
ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య అభిమానులను అలరించిందేకు సిద్ధమైంది నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి. మరోసారి సమరసింహారెడ్డిని గుర్తు చేస్తూ.. బాలయ్యబాబు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న సంక్రాంతి సందర్భంగా నేడు విడుదలైంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటించింది. దునియా విజయ్ విలన్ పాత్ర పోషించాడు. కొద్ది రోజులుగా జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకి విడుదలైంది. ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం…
అన్నా చెల్లెళ్లై వైరం నేపథ్యంలో సినిమా నడుస్తుంది. వీరసింహారెడ్డి, భానుమతి అన్నా చెల్లెళ్లు కాగా అన్నయ్య.. చెల్లిని ప్రాణంగా చూసుకుంటాడు. కాని చెల్లి మాత్రం ఎప్పుడు అన్నపై కోపంగా ఉంటుంది. అందుకు కారణం తాను ప్రేమించిన వాడిని అన్న చంపాడనే అనుమానం. అయితే అన్నపై కోపంతో వీరసింహారెడ్డికి వైరం పెట్టుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకొని కక్ష సాధింపు చర్చలు చేపడుతుంది. రాయలసీమలో వీరసింహారెడ్డిని చంపడం అసాధ్యం అనుకున్న భానుమతి విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనను మట్టు బెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ నందమూరి అభిమానుల్లో జోష్ పెంచింది. అమెరికా నుండి అనకాపల్లి దాకా నైజాం నుండి న్యూజెర్సీ దాకా ఒక్కటే దంచుడు. ఎప్పటిలానే బాలయ్య తన నటనతో అదరగొట్టాడు. శృతి హాసన్, , దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, నవీన్ చంద్ర, లాల్ వారి వారి పాత్రలలో ఇరగదీసారు. బాలయ్య వన్ మ్యాన్ షోతో మరోసారి థియేటర్స్ దద్దిరిల్లి పోతున్నాయి అని చెప్పాలి.
దర్శకుడు గోపిచంద్ మలినేని ప్రతి ఫ్రేమ్‌ని చాలా ఆద్యంతంగా ఆసక్తిగా మలిచాడు. థమన్ మ్యూజిక్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు మిగతా సాంకేతిక నిపుణుల పనితీరు ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులని అలరిస్తున్నాయి. వీరసింహారెడ్డి చిత్రంలో అధికార వైసీపీ ప్రభుత్వంపై భారీగా డైలాగ్స్ ఉన్నాయి. వైసీపీ పార్టీని బాలయ్య, డైరెక్టర్ గోపిచంద్ గట్టిగా వేసుకున్నట్టు కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
బాలయ్య నటన
థమన్ మ్యూజిక్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కథ పాతదే కావడం
కొన్ని బోరింగ్ సన్నివేశాలు
ఫైనల్‌గా:
వీరసింహారెడ్డి ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చే చిత్రం. ఫస్టాఫ్, ఇంటర్వెల్ వీరలెవెల్.. సెకండాఫ్, క్లైమాకస్ అదిరిపోతుంది. మీరు చించి తెచ్చుకొన్న పేపర్ బస్తాలు.. ఇంటర్వెల్‌కు అయిపోతాయి. వీరసింహారెడ్డి ఫస్ట్ 30 నిమిషాలు కొంత బోర్‌గా అనిపించిన ఫస్టాఫ్ డీసెంట్ గా ఉంటుంది. ఎలివేషన్ సీన్లు ఇరగదీశాడు. బాలయ్య, తమన్ మాస్ డ్యూటీ చేశారు. ఫైట్ సీన్లను తమన్ బాగా ఎలివేట్ చేశారు. అఖండ సినిమాను గోపిచంద్ ఫాలో అయినట్టుగానే కనిపిస్తుంది.
బాలయ్య ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రాల నడుమనే ప్రధానంగా బాక్సాఫీస్ ఫైట్ ఉండనుండగా, ఈ ఇద్దరి చిత్రాలకు నిర్మాత ఒక్కరే కావడం విశేషం. అంతేకాదు ఈ రెండు చిత్రాల్లోని కామన్ పాయింట్ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తోంది. వీరసింహారెడ్డి దర్శకుడు బాలయ్యకు పెద్ద ఫ్యాన్ కాగా.. వాల్తేర్ వీరయ్య దర్శకుడు బాబీ చిరంజీవికి ఫ్యాన్ అనే విషయ విదితమే. ఓవర్‌సీస్‌లో ఈ మూవీ కలెక్షన్ల వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద కేవలం ప్రీ-సేల్స్‌తోనే 525K డాలర్స్ దాటేసిందని అంటున్నారు. ఇక బుధవారం రాత్రికి ప్రీమియర్ షోలు జరగనుండగా.. మొత్తంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని వసూళ్లు సాధిస్తుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ‘వీరసింహా రెడ్డి’ ప్రస్తుతం 287 లొకేషన్స్ నుంచి $505,330 వసూల్ చేయగా, మరోవైపు మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య 274 స్థానాల నుంచి $398,160 కలెక్షన్లు వసూల్ చేసినట్టు తెలుస్తుంది.. అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో వీరసింహా రెడ్డి హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేయగా.. ఇది బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక యూఎస్ఏ ప్రీమియర్ గ్రాసర్‌గా నిలిచిందని అంటున్నారు. దుబాయ్‌లో ఉంటూ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకుంటూ సినీ విమర్శకుడిగా చెలామణీ అవుతోన్న ఉమైర్ సంధు ఇప్పటికే ఈ సినిమా గురించి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. బాలయ్య సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చిన ఉమైర్.. సినిమాలోని అంశాల గురించి మాత్రం రెండు రకాలుగా చెప్పుకొచ్చాడు. సినిమాలోని కథ, కథనం కొత్తగా ఏమీ లేకపోయినా..
సినిమా మాత్రం ఎంగేజింగ్‌గా, టైమ్‌పాస్ అయ్యే విధంగా ఉందని అన్నాడు. మాస్ ఆడియన్స్‌ను బాలకృష్ణ తన పంచ్ డైలాగులతో అలరించనున్నాడని కొన్ని సన్నివేశాల్లో తన భావోద్వేగ నటనతో కన్నీళ్లు కూడా పెట్టిస్తాడని అన్నాడు. ఇక సినిమాకి సంబంధించిన నాన్ స్టాప్ యాక్షన్ స్టంట్స్, స్టోరీ, స్క్రీన్‌ప్లే కొత్తగా ఏమీ లేకపోయినప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా, టైంపాస్ అయ్యే విధంగా ఉంటుందని ఉమైర్ తన సోషల్ మీడియా పేజ్‌లో రాసుకొచ్చాడు. టర్కీ లొకేషన్స్‌ను అద్భుతంగా చూపించారని, శృతిహాసన్ మరోసారి తన నటనతో కట్టిపడేసిందని పేర్కొన్నారు. ఇక ఆఖరి 15 నిమిషాలు సినిమా అద్భుతం అని చెప్పిన దుబాయ్ రివ్యూయర్ ఇది పైసా వసూల్ మూవీ’’ అని చెప్పుకొచ్చాడు..
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.