Navodaya School : నవోదయ స్కూల్‌లో పిల్లలను చదివించాలని అనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్
Navodaya School : ఏలూరు జిల్లా, పెదవేగి మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయం (JNV)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి ఎం. వెంకటలక్ష్మమ్మ వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే గడువు జూలై 29, 2025 వరకు కొనసాగనుంది. అభ్యర్థులకు డిసెంబర్ 13, 2025న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఎంపీవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమగ్ర సమాచారం అందించాలని డీఈవో సూచించారు.
నవోదయ విద్యాలయాల సమితి భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించేందుకు ఈ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రవేశం పూర్తిగా ప్రతిభాపరంగా ఉంటుంది. విద్యార్థుల ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా, వారి విజ్ఞాన సామర్థ్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం నవోదయల ప్రత్యేకత. ఏడేళ్ల పాటు పూర్తిగా ఉచిత విద్య, వసతి, భోజనం, విద్యాసామగ్రి లభిస్తాయి.

Navodaya School : నవోదయ స్కూల్‌లో పిల్లలను చదివించాలని అనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్
నవోదయ విద్యాలయాల్లో విద్యనభ్యసించడం వల్ల విద్యార్థులకు ఉత్తమమైన విద్యా వాతావరణం, వ్యక్తిత్వ వికాసం, ప్రతిభను మెరుగుపరచే అవకాశాలు లభిస్తాయి. సివిల్ సర్వీసెస్, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఇది బలమైన పునాది అవుతుంది. గ్రామీణ విద్యార్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://navodaya.gov.in ను సందర్శించవచ్చు లేదా సమీప ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించవచ్చు.