Youtube : గుడ్ న్యూస్.. యూట్యూబ్ లో కొత్త ఫీచర్.. యూట్యూబ్ క్రియేటర్స్ కు ఇక డబ్బులే డబ్బులు
Youtube: మీకు యూట్యూబ్ లో చానెల్ ఉందా? మీరు యూట్యూబ్ క్రియేటరా? యూట్యూబ్ Youtube లో వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారా? అయితే.. మీకో గుడ్ న్యూస్. యూట్యూబ్ క్రియేటర్స్ కు మద్దతు ఇవ్వడం కోసం యూట్యూబ్ Youtube సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని వల్ల.. యూట్యూబ్ క్రియేటర్లు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. అందుకే.. యూట్యూబ్ లో వీడియోలు చేసే క్రియేటర్లు ఇక ఎక్కువ ఉత్సాహంతో వీడియోలు చేయొచ్చు.

youtube latest feature money for creators
యూట్యూబ్ క్రియేటర్స్ కోసమే యూట్యూబ్ Youtube Super Thanks అనే ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ లో భాగంగా.. యూట్యూబ్ లో వీడియోలు చేసే క్రియేటర్లకు వాళ్ల వీడియోలు చూసిన వాళ్లు.. ప్రోత్సాహకంగా అంతో ఇంతో డబ్బు పంపించవచ్చు. అది కేవలం వాళ్లకు మద్దతు ఇవ్వడం కోసం, ఇంకా అటువంటి మంచి వీడియోలు తీయడం కోసం వాళ్లు చేసే సాయం అది. ఇది వరకు కూడా ఇటువంటి ఫీచర్ ఉన్నప్పటికీ.. జాయిన్ అనే ఫీచర్ ద్వారా ఆ చానెల్ ప్రీమియంను తీసుకొని.. దాని కోసం అంతో ఇంతో ఎమౌంట్ చెల్లించాల్సి ఉండేది.

youtube latest feature money for creators
Youtube : Super Thanks ద్వారా ఎలా డబ్బులు వస్తాయంటే?
Super Thanks అనే ఆప్షన్ ద్వారా వీక్షకులు.. యూట్యూబ్ క్రియేటర్స్ కోసం 2 నుంచి 50 డాలర్ల వరకు డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేసిన వాళ్లను కామెంట్ సెక్షన్ లో హైలెట్ చేస్తారు. మన కరెన్సీ లో అయితే.. 140 రూపాయల నుంచి 3500 రూపాయల వరకు అన్నమాట. తక్కువ నిడివి కలిగిన వీడియోలకు ప్రస్తుతం ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్, ఇతర వీడియో యాప్స్ ఎక్కువగా 15 సెకండ్ల నిడివితోనే వీడియోలను రూపొందిస్తున్నాయి. ఎక్కువ యూజర్లు కూడా అటువంటి వీడియోలను చూడటానికే ఇష్టపడుతున్నారు.

youtube latest feature money for creators
అందుకే.. యూట్యూబ్ కూడా Youtube Shorts అనే ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా తక్కువ నిడివి ఉన్న వీడియోలను అప్ లోడ్ చేయొచ్చు. ఆ వీడియోలకు సపోర్ట్ గా Super Thanks ఫీచర్ ను యూట్యూబ్ తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్ 68 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే క్రియేటర్స్ అందరికీ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది యూట్యూబ్.
ఇది కూడా చదవండి ==> టిక్ టాక్ దుర్గారావు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> కోతుల నుంచి మనుషులకు సోకుతున్న కొత్త వైరస్.. ఇది కరోనా కన్నా డేంజర్?
ఇది కూడా చదవండి ==> మీ ఇంట్లోనే యాపిల్ చెట్టును పెంచుకోవచ్చు.. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..!
ఇది కూడా చదవండి ==> ప్రైవేట్ పార్టీలో రెచ్చిపోయిన సమంత.. వైరల్ ఫోటో