Apple Tree: మీ ఇంట్లోనే యాపిల్ చెట్టును పెంచుకోవచ్చు.. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Apple Tree: మీ ఇంట్లోనే యాపిల్ చెట్టును పెంచుకోవచ్చు.. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 July 2021,9:30 pm

Apple Tree : యాపిల్ పండ్లు తెలుసు కదా. అవి అంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవ్వరూ ఉండరు. యాపిల్ పండ్లను మనం సేపులు అని అంటాం. ఏ మార్కెట్ లో చూసినా యాపిల్స్ కనిపిస్తారు. యాపిల్స్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే.. మన దగ్గర యాపిల్ చెట్లను పండించరు. దానిమ్మ పండ్లు, జామ కాయలు, బత్తాయిలు లాంటి పండ్ల చెట్లు మన దగ్గర కనిపిస్తాయి కానీ.. యాపిల్ చెట్లు మాత్రం ఎక్కడా కనిపించవు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. సౌత్ ఇండియాలో కూడా ఎక్కడ చూసినా ఒక్క యాపిల్ చెట్టు కనిపించదు. దానికి కారణం.. మన వాతావరణంలో చెట్లు బతకవు.

how to grow apple tree at home with seeds

how to grow apple tree at home with seeds

యాపిల్ చెట్లు ఎక్కువగా జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా లాంటి ప్రాంతాల్లోనే పండుతాయి. బాగా చలిగా ఉండే ప్రాంతాల్లోనే ఈ చెట్లు బతుకుతాయి. ఏమాత్రం ఎండ తాకినా ఈ చెట్లు బతకవు. అందుకే.. మన వాతావరణాన్ని ఈ చెట్లు తట్టుకోలేవు. కానీ.. కొన్ని టెక్నిక్స్ పాటిస్తే.. మన దగ్గర కూడా యాపిల్ చెట్లను పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.

Apple Tree : యాపిల్ చెట్లను పెంచుకోవడం కోసం ఈ టిప్స్ ఫాలో అవండి

సాధారణంగా యాపిల్ పండును తిన్నాక అందులో నల్లటి గింజలు ఉంటాయి. కొన్ని యాపిల్స్ లో ఎర్రటి గింజలు ఉంటాయి. నల్ల గింజల కంటే.. ఎర్రగా ఉండే గింజలు త్వరగా మొలకెత్తుతాయి. మార్కెట్ లో ఈ గింజలు దొరుకుతాయి. ముందు మార్కెట్ కు వెళ్లి.. యాపిల్ సీడ్స్ ను తెచ్చుకోండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని.. ఆ పేపర్ మీద కొన్ని నీళ్లు చల్లి.. ఆ టిష్యూలో యాపిల్ విత్తనాలను వేయండి. ఆ తర్వాత ఆ టిష్యూను మూసేయండి. టిష్యూను చుట్టేసి ఒక బాక్స్ లో పెట్టండి. ఆ బాక్స్ లోకి ఏమాత్రం గాలి రాకుండా గట్టిగా మూత పెట్టేయండి.

how to grow apple tree at home with seeds

how to grow apple tree at home with seeds

రెండు రోజులు దాన్ని అలాగే ఉంచండి. రెండు రోజుల తర్వాత మళ్లీ ఆ గింజలను తీసి.. వేరే టిష్యూ పేపర్ లో వేసి మళ్లీ అదే డబ్బాలో వేసి మూత పెట్టండి. మరో రెండు రోజులు వాటిని అలాగే ఉంచండి. ఆ తర్వాత మరోసారి టిష్యూ మార్చండి. ఇలా.. మూడు సార్లు టిష్యూలను మార్చుతూ యాపిల్ గింజలను డబ్బాలో పెట్టాలి.

how to grow apple tree at home with seeds

how to grow apple tree at home with seeds

ఆ తర్వాత ఆ విత్తనాలను తీసుకొని ఒక కుండీలో నాటండి. నాటిన తర్వాత.. దానికి కంపోస్టు ఎరువు కావాలి. దాని కోసం మార్కెట్ లో దొరికే వర్మీ కంపోస్టును తీసుకున్నా పర్వాలేదు. మీరు కంపోస్ట్ ను తయారు చేసుకున్నా దాన్ని వేసుకోండి. అలా.. 15 రోజులకు ఒకసారి.. ఎరువును కూడా మార్చుతూ ఉండండి. అయితే.. యాపిల్ చెట్టుకు పెద్దగా నీళ్లు అవసరం లేదు. చాలా తక్కువ నీళ్లు పోస్తూ ఉండాలి. ఆ తర్వాత యాపిల్ విత్తనాలు నాటిన కుండీని రోజూ ఓ గంట పాటు మాత్రమే ఎండలో ఉంచండి. ఆ తర్వాత దానికి ఎండ అస్సలు పడకూడదు.

మీ ఇంట్లోనే వచ్చే కూరగయాల వ్యర్థాలతో చేసే వర్మీ కంపోస్ట్ అయితే యాపిల్ చెట్లు త్వరగా పెరుగుతాయి. అలా.. ఓ ఆరు నెలల పాటు జాగ్రత్తగా పెంచితే చెట్టు కొంచెం పెద్దదవుతుంది. కాకపోతే.. సిమ్లాలో పెరిగేంత పెద్దగా చెట్టు పెరగకున్నా.. బొన్సాయ్ చెట్టులా పెరుగుతుంది. బొన్సాయ్ చెట్టులా పెరిగినా కూడా దానికి యాపిల్స్ కాస్తాయి. అవి నాణ్యంగా ఉండటంతో పాటు.. ప్రకృతి సిద్ధంగా పండుతాయి కాబట్టి.. ఆ యాపిల్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో యాపిల్ చెట్లను పెంచుకోండి.

ఇది కూడా చ‌ద‌వండి ==>  షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? ఈ టీని నిత్యం తీసుకోండి.. షుగర్ ను తగ్గించుకోండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏ రాశి వారు ఏ యోగాసనం వేస్తే మంచిదో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఉల్లిపాయ రసం అమృతం లాంటిది.. నిత్యం దీన్ని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> డ‌యాబెటిస్ ఉన్న వారికి  గుడ్ న్యూస్ …లాలాజ‌లంతో షుగ‌ర్ ప‌రీక్ష ?

Also read

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది