YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. 2లక్షల 79వేల 65మంది లబ్ధిదారులకు రూ. 590.91 కోట్ల మొత్తాన్ని పెన్షన్ల కోసం విడుదల చేశారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందని వారికి మరోసారి అవకాశం ఇచ్చామని సీఎం చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ ఇవ్వడం లేదన్నారు సీఎం. అధికారం అన్నది పెత్తనం చలాయించడం కోసం కాదు. ప్రజలకు సేవ చేసేందుకేనని చెప్పడానికి గొప్ప నిదర్శనంగా ఈరోజు అమలు చేస్తున్న కార్యక్రమం నిలుస్తుందన్నారు ముఖ్యమంత్రి. మానవత్వంతో పరిపాలన.. ఎక్కడా లంచాలకు, వివక్షకు తావులేకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్నామని పునరుద్ఘాటించారు
తప్పుడు ప్రచారాన్నితిప్పికొట్టండి..అధికారులకు సీఎం ఆదేశం జనవరి 1వ నుంచి పెన్షన్ డబ్బును పెంచుతున్నామనే వార్తను జీర్ణించుకోలేని ఎల్లో మీడియా కుట్రతో పెన్షన్‌ల మీద కట్టుకథలు రాస్తున్నారని మండిపడ్డారు. మనం చేస్తున్న యుద్ధం ఒక పార్టీతో కాదు.. ఒక విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. మనం ఏ మంచి చేసినా.. దాన్ని వక్రీకరించి నెగెటివ్‌గా చూపించాలనే ఎల్లో మీడియా అనే విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. విషపు రాతలు, విషపు చేష్టలు, వక్రీకరణలు చేసేవారికి దేవుడే బుద్ధిచెబుతాడు. విషపు వ్యవస్థ చేసే ఏ ఆరోపణనైనా పాజిటివ్‌గా తీసుకుందాం. దాంట్లో నిజం ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుందాం. నిజం లేకపోతే బయటకువచ్చి వారిని తిట్టే కార్యక్రమం కూడా చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తున్నాను. అలా తిట్టకపోతే వారు రాసిన అబద్ధాలు నిజం ఏమో అనే సందేహం ప్రజల్లోకి వెళ్తుంది.
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ లకు సీఎం జగన్ చెప్పారు. పెన్షన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు పెన్షన్లకు సంబంధించి ఈరోజు కొంతమందికి నోటీసులు వెళ్లాయి. దానిలో తప్పేముంది. ప్రతి ఆరునెలలకు ఒకసారి ప్రతి పథకానికి సంబంధించి ఒక ఆడిట్ జరగాలి. మన ప్రభుత్వ ఉద్దేశం అర్హులు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు. అనర్హత ఉన్నవారికి ఏ ఒక్కరికీ రాకూడదు అనేది మన ప్రభుత్వ ఉద్దేశం. ఆరునెలలకు ఒకసారి కచ్చితంగా ఎక్కడైతే సందేహాలు ఉంటాయో దాని ప్రకారం నోటీసులు ఇస్తారు.. వాటికి రిప్లయ్ కూడా తీసుకుంటారు. ఆ తరువాత రీ వెరిఫై చేసిన తరువాతే ఏదైనా చర్య తీసుకుంటారు. నోటీసులు ఇచ్చినందుకే పెన్షన్లు అన్నీ తీసేస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు గత ఆరు నెలలుగా జూన్ నుంచి నవంబర్ వరకు దాదాపు 11 సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఈ పథకాల్లో పొరపాటున మిస్ అయిన 2,79,065 కుటుంబాలకు ఈ రోజు రూ.591 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. లంచాలకు ఏమాత్రం తావులేకుండా, వివక్షకు ఎక్కడా చోటు ఇవ్వకుండా ఎంత పారదర్శకంగా పరిపాలన సాగుతోందని చెప్పడానికి చిన్న ఉదాహరణ.. లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని… మూడున్నరేళ్లలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.85 లక్షల కోట్లు, . డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తం రూ.3.30 లక్షల కోట్లు అందించామన్నారు. ముఖ్యమంత్రికి కళ్లు, చెవులు కలెక్టర్లే. వాళ్లు బాగా పనిచేస్తే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రతి కలెక్టర్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను.
టీడీపీ హయాంలో పెన్షన్లు 39 లక్షల మందికి ఇచ్చేవారు. మన ప్రభుత్వం పెన్షన్లు 62.70 లక్షల మందికి ఇస్తున్నాం. గతంలో ఒక్కొక్క పెన్షన్ కింద రూ. 1000 ఇచ్చేవారు. మన ప్రభుత్వంలో పెన్షన్ డబ్బును అక్షరాల రూ.2750కి పెంచుతున్నాం. పెన్షన్ల సంఖ్య 39 లక్షల నుంచి 62.70 లక్షలకు చేరిందంటే.. దాని అర్థం 60 శాతం గ్రోత్. వెయ్యి రూపాయల పెన్షన్ రూ.2750కి చేరిందంటే.. 175 శాతం పెరుగుదల. గతంలో పెన్షన్ బిల్లు నెలకు రూ. 400 కోట్లు అవుతుంటే.. మన ప్రభుత్వంలో పెన్షన్ బిల్లు రూ.1770 కోట్లు అవుతుంది. ఇలాంటి మానవత్వం ఉన్న ప్రభుత్వంలో ఏ పేదవాడికైనా నష్టం జరుగుతుందా అనేది ప్రతి ఒక్కరూ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాలని కోరుతున్నానని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరారు.
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్లో కూడా…
This website uses cookies.