Ys Jagan : పరిశ్రమల ఏర్పాటుకు జగన్ చేస్తున్న కృషికి ఇది నిదర్శణం
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో భారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పలు భారీ ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపడంతో పాటు పలు కంపెనీల రాష్ట్రంలో నెలకొల్పే విధంగా ఒప్పించారు. తాజాగా మరో భారీ పరిశ్రమను నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం లో ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ మరియు మిత్ర దాతు నిగమ్ సంస్థలు సంయుక్తంగా అల్యూమినియం లిమిటెడ్ ఆధ్వర్యంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయి.
ఈ పరిశ్రమ ఏర్పాటుకు మొదట తలెత్తిన సమస్యలను ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో వెంటనే పరిష్కరించారు. అధికారులను మరియు సంబంధిత వ్యవస్థను వెంటపడి మరి సదరు పరిశ్రమల ఏర్పాటులో సీఎం జగన్ కీలక పాత్ర వహించారు. పరిశ్రమ ఏర్పాటు కు ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టి కి అధికారులు తీసుకెళ్లడంతో సీఎం స్పందించిన తీరుపై ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన పరిశ్రమకు దాదాపు రూ. 5500 కోట్ల పెట్టుబడులను సదరు సంస్థ పెట్టబోతోంది.
ఈ పరిశ్రమ వల్ల సుమారు వెయ్యి మందికి ఉపాధి కలుగుతుందని, తద్వారా జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అవకాశాలు లేవంటూ పలు కంపెనీలు వెనక్కు వెళ్ళి పోయాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి మరీ భారీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ప్రైవేటు రంగ సంస్థలను ఇస్తున్నారు. ఇది ఆయన యొక్క కృషికి నిదర్శనం అంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వరుసగా పెద్ద పరిశ్రమలు ఏర్పాటు భవిష్యత్తులో మంచి ఉపాధి లభించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.