Ys Jagan : మొద‌టి సారి ఒప్పుకున్న వైఎస్ జ‌గ‌న్‌..!

Authored By Akkirala | The Telugu News | Published on: June 10, 2021, 7:59 pm

Ys Jagan : ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో రెండో ప్రయత్నంలో అపూర్వ విజయాన్ని సాధించి రెండేళ్లు గడిచిపోయింది. సీఎం కావాలనే తన కలను ఆయన ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. అదే ఉత్సాహంతో ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో పలు ఆటంకాలను కూడా ఎదుర్కొన్నారు. ఈ అడ్డంకులకు ప్రధాన కారణ ప్రతిపక్ష పార్టీలు అని పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో సైతం ఒకటీ రెండు సార్లు తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. తాము జనానికి మేళ్లు చేయాలని చూస్తుంటే అపొజిషన్ పార్టీలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పాలిటిక్స్ లో ఫార్టీ ఇయర్స్ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు తెలివిగా అన్ని వ్యవస్థల్లో తన మనుషులను పెట్టి ఇప్పటికీ మేనేజ్ చేస్తున్నాడని తప్పుపట్టారు. ఎవరేం చేసినా తనకు ప్రజల మద్దతు, దేవుడి దయ ఉన్నంత కాలం విజయవంతంగా ముందుకు సాగుతానంటూ మనోధైర్యాన్ని ప్రకటించారు.

ముక్కుసూటితనం..

రాజకీయాల్లో ముక్కుసూటిగా వెళ్లితే ఎదురుదెబ్బలు తగులుతాయని విశ్లేషకులు అంటుంటారు. అయినా వైఎస్ ఫ్యామిలీ అదే పంథాను అనుసరిస్తుంది. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ డైరెక్టుగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రకాలే. డేరింగ్, డ్యాషింగ్ గా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వాళ్లిద్దరికీ ప్రధాన విపక్ష నేత చంద్రబాబు ఒక్కరే కావటం చెప్పుకోదగ్గ విషయం. తెలుగుదేశం పార్టీ అధినేతకు తెలివితేటలు ఎక్కువనే మాట ప్రచారంలో ఉంది. ఆ ట్యాలెంట్ తో ఆయన ఎవరినైనా బోల్తా కొట్టించగలడని చెబుతుంటారు. తన తప్పిదాలను, వైఫల్యాలను కవర్ చేయటానికి ఎల్లో మీడియా ఎలాగూ ఉంది. వైఎస్ ఫ్యామిలీ అంత వ్యూహాత్మకంగా వ్యవహరించదని కాదు గానీ ప్రచార, ప్రసార మాధ్యమాల మద్దతు పెద్దగా లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సీఎం వైస్ జగన్ తన ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే చిత్తు చేయాలంటే మరింత షార్ప్ గా ఉండాలి.

Ys Jagan

Ys Jagan

పార్టీ ఓకే.. ప్రభుత్వం వీకే.. : Ys Jagan

టీడీపీ వేసే పొలిటికల్ కౌంటర్లకు పార్టీ పరంగా వైఎస్సార్సీపీ సమర్థవంతంగానే ఎన్ కౌంటర్లు వదులుతుంది. కానీ ప్రభుత్వ అధికారులు, సలహాదారులే ముఖ్యమంత్రి మెంటాలిటీకి తగ్గట్లుగా నడుచుకోవట్లదనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ సర్కారుకి కోర్టుల్లో ఎక్కువ ఎదురుదెబ్బలు తగలటానికి గవర్నమెంట్ ఆఫీసర్ల లోపాలే ముఖ్య కారణమని చెప్పొచ్చు. న్యాయస్థానాల్లో సరిగా వాదించకపోవటం, ఏ నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష పార్టీలు ఏవిధంగా సవాల్ చేస్తాయో.. కోర్టులు ఏవిధంగా స్టేలు ఇస్తాయో ముందుగా అంచనా వేయలేకపోవటం వంటివి ఫెయిల్యూర్స్ గా చెప్పుకోవచ్చు. రానున్న మూడేళ్లలో అయినా ఇలాంటి చుక్కెదుర్లు కాకుండా చూసుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

Akkirala

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp