Ys Jagan : జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్తె చంద్ర‌బాబు హ్యాపీనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్తె చంద్ర‌బాబు హ్యాపీనా..?

 Authored By kondalrao | The Telugu News | Updated on :9 June 2021,7:55 pm

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గురువారం హస్తినకు వెళుతున్నారు. ఈ మేరకు ఇవాళ బుధవారం అధికారిక ప్రకటన ఏదీ విడుదల కాకపోయినా ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని చెబుతున్నారు. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీకి వెళ్లారంటే తన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలనే, సమస్యలనే కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారు. పనిలో పనిగా తాజా రాజకీయ పరిస్థితులను కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ సీఎంకి రాష్ట్రంలో అనుకూల మీడియా ఉంటే తన పర్యటన వివరాలను విశ్వసనీయంగా, ఆసక్తికరంగా రాస్తాయి. టీవీ ఛానళ్లయితే చక్కగా వీడియోలతో సహా వివరిస్తాయి.

ఆయన బ్యాడ్ లక్..

ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీకి, ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మద్దతిచ్చే మీడియాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసే ప్రసార, ప్రచార మాధ్యమాలు మాత్రం అంత ఎఫెక్టివ్ గా వ్యవహరించవు. ఎక్స్ క్లూజివ్ స్టోరీలను ఇచ్చే స్థితిలో లేవు. అంతేకాదు. అపొజిషన్ పార్టీలను ఆకాశానికెత్తేసే మీడియాలు సమర్థవంతంగా పనిచేస్తుండటం సీఎం జగన్ బ్యాడ్ లక్. ఫలితంగా అవి ఆయనకు ఎల్లవేళలా నెగెటివ్ గానే న్యూస్ ని ప్రజెంట్ చేస్తుంటాయి. ప్రజలు నమ్మేవిధంగా ప్రత్యేక కథనాలను వండి వార్చుతాయి. కాబట్టి జగన్ ఢిల్లీ పర్యటనలో వాస్తవంగా జరిగేది ఒకటైతే జనంలోకి వెళ్లే సమాచారం మరొకటవుతోంది. ఏదేమైనప్పటికీ వైఎస్సార్సీపీ మీడియా మేనేజ్మెంట్ లో మంచి మార్కులను సంపాదించలేకపోతోంది.

ys jagan delhi Tour

ys jagan delhi Tour

ప్రస్తుతానికొస్తే..: Ys Jagan

జగన్ రేపు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో ఎవరికీ అంతగా తెలియదు. కానీ ఎల్లో మీడియా మాత్రం అప్పుడే తన ప్రతికూల ప్రచారాన్ని ప్రారంభించింది. నర్సాపురం ఎంపీ రఘురామరాజు వ్యవహారంలో ఏపీ సర్కారు చేసిన తప్పిదాలపై ఆయన కేంద్ర పెద్దలకు వివరణ ఇచ్చేందుకే పోతున్నారంటూ తనకు తోచింది తాను రాసేసుకుంది. రాజద్రోహం కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయంటూ గోబెల్స్ మాదిరిగా గాలి వార్తలను వ్యాప్తి చేస్తోంది. ఆఫ్ట్రాల్ ఒక ఎంపీ ఫిర్యాదు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వివరణ కోరుతుందా?. అంతా నాన్సెన్స్. ఇలాంటి తప్పుడు కథలను ఎప్పటికప్పుడు ఖండించటం, అసలు జరుగుతున్నదేంటో వివరించటం జగన్ మీడియా వల్ల కాదు. ఏపీ సీఎంకి ఢిల్లీలో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కన్ఫార్మ్ అయితే ఇలా, కాకపోతే ఆయన్ని అక్కడ పట్టించుకునే నాథుడు లేడంటూ మరోలా పచ్చ మీడియా పచ్చిగా, పిచ్చి పిచ్చిగా రాయగలదు. అదే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసలు బలం.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇక్క‌డ నుండి ఎరిగి ‘కాకి’ అక్క‌డ వాలింది..!

ఇది కూడా చ‌ద‌వండి ==> అక్క‌డ వైసీపీ గ్రూప్ పాలిటిక్స్… టీడీపీకి ఇదే మంచి చాన్స్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> 2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి అక్క‌డ గ‌ట్టి పోటీ త‌ప్ప‌దా…?

ఇది కూడా చ‌ద‌వండి ==> ప్రపంచ రికార్డు బద్దలు.. ఒకే కాన్పులో 10 మంది పిల్ల‌లు..!

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది