Ys jagan ఆంధ్రప్రదేశ్ లో ఆ ఒక్క నియోజకవర్గం వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఎన్ని వ్యూహాలు రచించినా అక్కడ జెండా పాతడం కష్టంగా మారింది. మరోసారి జేసీ బ్రదర్స్ జెండాను ఎగురవేసి సత్తా చాటారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా టీడీపీకి దక్కిన ఏకైక పీఠం తాడిపత్రి మాత్రమే.. అది కూడా జేసీ బ్రాండ్ తోనే అక్కడ గెలుపు సాధ్యమైంది. అయితే చైర్మన్ పదవి చేజారినా.. రెండో వైస్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలని వైసీపీ భావించింది.
అందుకు గత కొన్ని రోజుల నుంచి వ్యూహాలు రచిస్తూనే ఉంది. కానీ ఆ వ్యూహాలను జేసీ తిప్పి కొట్టారు. తాడిపత్రిలో ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవాలి అనుకున్నారు MLA పెద్దారెడ్డి. దీంతో రెండో వైస్ చైర్మన్ ఎన్నికలో అనూహ్య పరిణామాలు ఏమైనా జరుగుతాయా అన్న అనుమానాలు ఉత్కంఠ పెంచాయి. కానీ చివరికి జేసీ ముందు ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. తాడిపత్రి జేసీ అడ్డా అని.. ఇక్కడ పెద్దారెడ్డి ఆటలు చెల్లవని జేసీ ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయంగా హీట్ ను పెంచాయి.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రెండవ వైస్ ఛైర్మన్‌గా పాతకోట బంగారు మునిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో టీడీపీకి 18, వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. ఒకరు సీపీఐ నుంచి, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారిద్దరూ TDPకే మద్దతు ఇచ్చారు. దీంతో TDP బలం 20కి పెరిగింది. YCPకి ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ బలం 18కి చేరింది. వైసీపీ గైర్హాజరుతో ఎలాంటి నెంబర్ గేమ్ లేకుండానే టీడీపీ మద్దతుదారే వైస్ చైర్మన్ అయ్యారు. తాడిపత్రిలో గట్టిగా పట్టు పడితే రెండో చైర్మన్ పీఠం దక్కించుకోవడం వైసీపీ సాధ్యమయ్యేదే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాడిపత్రి సీపీఐ కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ కుటుంబాలకు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మద్దతు పలికారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌన్సిలర్లను వేధించడం పద్ధతి కాదని హెచ్చరించారు ప్రభాకర్‌రెడ్డి. దీంతో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి పరిణామాలు నెలకుంటాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ జేసీ తన మద్దతు దారులందరినీ తనకు సపోర్ట్ గా ఉండేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో వైసీపీ వ్యూహాలు అన్నీ బెడిసి కొట్టాయి..
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
This website uses cookies.